ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న వారి మధ్య ఈ చట్టంపై చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో భూవివాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ చట్టం వస్తే ఎంత ప్రమాదకరంగా పరిస్థితి మారుతుందోనన్న చర్చ అన్ని వర్గాల రైతుల్లోనూ నడుస్తోంది.

ఈ చట్టాన్ని విశ్లేషించుకుంటే ఎవరైనా భయపడకుండా ఉండలేరు. నేరుగా హైకోర్టుకు వెళ్లేవరకూ ప్రభుత్వ అధికారుల దగ్గరే అప్పీల్ చేసుకోవాలి. అదే జరిగితే..ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే ఈ చట్టంపై వైసీపీ సానుభూతిపరులు కూడా సంతృప్తికరంగా లేరు. ఇంకా ప్రధానమైన విషయం తమ ల్యాండ్ డాక్యుమెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటూ ఉండటం. అది ప్రభుత్వ ల్యాండ్ కాదు. ప్రైవేటు ల్యాండ్. ప్రభుత్వం సర్వే చేసి పత్రాలిస్తుంది. అంత మాత్రం దానికే ఉంటుందో ఊడిపోతుందో తెలియని సీఎం ఫోటో వేసుకోవడం.. అది శాశ్వతంగా ఉంటుందని చెప్పడం చాలా మందిని అనుమానపరుస్తోంది. చట్టం ప్రకారం ప్రభుత్వ అధికార ముద్ర మాత్రమే ఉండాలి. కానీ జగన్ ఫోటోలు వేసుకుంటున్నారు.

ఇలా ప్రతీ ఒక్కటీ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. జగన్ రెడ్డి.. తన పోటో ప్రతి ఇంట్లో ఉండేలా చూసుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. అందరూ ఆయన మంచిపనులు చేసి .. కృతజ్ఞతతో ఆయన ఫోటోపెట్టుకునేలా చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఆయన తప్పనిసరి డాక్యుమెంట్ల మీద ఫోటోలు ముద్రదించుకుని ప్రతి ఇంట్లో తాను ఉంటానని చెప్పుకునేలా ఉన్నారు.ఇవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. వచ్చే పది రోజుల గ్రామ గ్రామాన చర్చా కార్యక్రమాలు పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close