రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను ఉసిగొల్పి ప్రత్యర్థి పార్టీల నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ తరపున మల్లిఖార్జున ఖర్గే కోసం ప్రచారం చేసేందుకు వెళ్లారు. అక్కడే స్పందించారు.

గతంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తమకు ఎలాంటి నోటీసులు..కేసులు వచ్చిన తెలంగాణపై దాడిగా చెప్పేవారు. లిక్కర్ కేసులో నోటీసులు వచ్చినప్పుడు కవిత తెలంగాణ తల వంచదు అని గంభీరమైన ప్రకటనలు చేశారు. కవిత ఢిల్లీలో లిక్కర్ స్కాం చేస్తే ఇక్కడ తెలంగాణ తల వంచడం ఏమిటి అన్న సెటైర్లు చాలా మంది వేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కేసులో కాకుండా.. ఓ సోషల్ మీడియా పోస్టు విషయంలో నోటీసులు ఇవ్వడంతో..దాన్ని సెంటిమెంట్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ కు ఈ నోటీసులు పెద్ద అస్త్రంలాగా కనిపిస్తున్నాయి. ఫేక్ వీడియో కేసులో అసోంలో ఓ యువకుడ్ని అరెస్టు చేశారని.. తెలంగాణ సీఎంను అరెస్టు చేయకపోతే.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య బంధం ఉన్నట్లేనని ఆయన తేల్చారు. బీఆర్ఎస్ నేతల ఆత్రుత చూసి కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సోషల్ మీడియా కేసులు ఎ మాత్రం నిలబడవని అందరికీ తెలుసు. ఎవరు క్రియేట్ చేశారో వారిపై కేసులు పెట్టగలరు కానీ.. షేర్ చేసిన వాళ్లపై నిందను మోపలేరు. అయినా రాజకీయంగా పనికి వస్తుందని వాళ్లు నోటీసులు ఇస్తారు.. వాళ్లు రాజకీయం చేసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close