అవినీతి అధికారుల్ని అలా శిక్షిస్తారంతే.. రివర్స్‌లో..!

జగన్ పాలనలో అవినీతి పరుల్ని ఎవర్నీ సహించి లేదని… ఎవర్నీ దగ్గరకు రానివ్వబోమని ముఖ్యమంత్రి జగన్ చెబుతూంటారు. ఇప్పుడు… చేతల్లో కూడా చూపిస్తున్నారు. కాకపోతే రివర్స్‌లో. అవినీతి ఆరోపణలు బలంగా రావడం.. ఏసీబీ, విజిలెన్స్ విచారణల్లోనూ అక్రమాలు తేలడంతో బదిలీ చేసిన దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు అంత కంటే కీలకమైన పోస్టింగ్‌ను ఏపీ సర్కార్ కేటాయించింది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబును నియమించారు. దీంతో దుర్గగుడిలో జరిగిన విచారణల గురించి… వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత గుడిలో జరిగిన వ్యవహారాల గురించి తెలిసిన వారంతా… ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

దుర్గగుడి ఈవో సురేష్ బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారని… అన్ని రకాల విచారణల్లోనూ ఆయన అవినీతి బయటపడిందని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. ఓ వైపు ఏసీబీ..మరో వైపు విజిలెన్స్.. ఇలా అన్ని రకాల విచారణ సంస్థలు.. దుర్గగుడి చెప్పుల స్టాండ్ దగ్గర్నుంచి ప్రసాదంలో లడ్డూల వరకూ అన్ని చోట్ల అవినీతికి పాల్పడ్డారని తేల్చారు. అందులో… ఈవో సురేష్‌బాబుకు కూడా ప్రధాన వాటా ఉందని నిర్ధారించారు. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిజానికి అప్పుడు ఏసీబీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని.. అర్హత లేకపోయినా ఈవోగా ఆయనను తెచ్చి చేసిన నియామకం దగ్గర్నుంచి దుర్గమ్మను అడ్డం పెట్టుకుని ఎంత వెనుకేసుకున్నారో.. ఎవరెవరికి ఎంతెంత సమర్పించుకున్నారో లెక్కలు బయటకు తీస్తారని అనుకున్నారు.

కానీ.. ఏపీ సర్కార్ మాత్రం… కింది స్థాయి .. రూ. వెయ్యి, రూ. రెండు వేలు లంచాలు తీసుకునే పదిహేను మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసేసి…అవే చర్యలని సరిపెట్టింది. అయితే తీవ్రమైన ఆరోపణలు మీడియాలో రావడంతో ఈవో సురేష్ బాబును మాత్రం బదిలీ చేసింది. మొదట దేవాదాయశాఖ రాజమండ్రి జాయింట్ కమిషనర్‌గా నియమించింది. అయితే అంత అవినీతి పరుడిని శిక్షిస్తున్నట్లుగా ప్రకటించి… ప్రమోషన్ ఇవ్వడం ఏమిటని అందరూ ప్రశ్నించడంతో అప్పటికి పోస్టింగ్ నిలిపివేశారు. కానీ ఆ పోస్టులో ఎవర్నీ నియమించలేదు. ఇప్పుడు.. ఆయనకు అదే పదవి ఇచ్చి సర్దుబాటు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close