రఘురామ కేసు రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందా..!?

రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారుతోంది. వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారన్నది పెద్ద విషయం అయ్యేఅవకాశం లేదు. ప్రభుత్వ పెద్దల ఇష్టం ప్రకారం.. మూడు నాలుగు రోజులు లేదా పది రోజుల్లో జైల్లో పెట్టగలిగేవారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చేది. ప్రభుత్వం.. రాజకీయ నేతలపై పెడుతున్న కేసులన్నీ ఇలాంటివే. కనీస ఆధారాలు లేకుండా… అన్నింటికీ ఆధారాలున్నాయని ప్రకటనలు చేస్తారు. అరెస్ట్ చేస్తారు. బెయిల్ రాకుండా కస్టడీలని..మరొకటని టైం పాస్ చేస్తారు. ఆ తర్వాత బెయిల్ వస్తుంది.అలా అచ్చెన్నాయుడుని రెండున్నర నెలల పాటు జైల్లో ఉంచగలిగారు. గత నెల రోజుల నుంచి ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీలో ఉంచుకోగలిగారు. అయితే.. వారి విషయంలో రాజకీయం అని చాలా మంది సరి పెట్టుకున్నా… ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని నేరుగా ఆయన నేరుగా న్యాయమూర్తికే ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల విషయంలో సీఐడీ పోలీసులు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. జీజీహెచ్ ఇచ్చిన డాక్టర్ల రిపోర్ట్ కూడా అనుమానాస్పదంగా ఉంది. వీడియో రికార్డింగ్ తీయాలని చెప్పినా తీయలేదు. పైగా.. కోర్టుకు మరో చాన్స్ లేకుండా… రాత్రి సమయంలో రిపోర్టు సమర్పించారు. ఆస్పత్రికి తరలించమంటారేమోనన్న అనుమానంతో ముందుగానే జైలుకు తరలించారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలిచ్చినా లెక్క చేయలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణ జరిగి.. ఆదేశాలిచ్చిన తర్వాత కూడా అమలు చేస్తారా లేదా అన్న సందేహం ఏర్పడింది. చివరికి… సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి కాల్ వచ్చిన తర్వాతనే ఏపీ సీఎస్‌లో కదలిక కనిపించింది.

నిజానికి రఘురామకృష్ణరాజు కేసు ఇంత సంచలనం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అరెస్ట్ చేసిన రోజు రాత్రే “కొడుతున్నారన్న అర్థం”లో వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. ఓ సామాజికవర్గాన్ని అదేపనిగా తిడుతూ పోస్టులు పెట్టే కొంత మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు… రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు కోటింగ్ ఇస్తున్నారని ప్రచారం చేశారు. దానికి తగ్గట్లు.. నిజంగానే తనను కొట్టారని.. రఘురామ ఫిర్యాదు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. అరికాలి వాపులు, వాతలు తేలిన కాళ్ల ఫోటోలు నేషనల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. వాపులున్నాయి… రంగు మారింది కానీ కొట్టిన దెబ్బలు కాదని జీజీహెచ్ డాక్టర్ల రిపోర్ట్ ఇవ్వడం మరింత అనుమానాలకు కారణం అయింది.

రమేష్ ఆస్పత్రిపై టీడీపీ ముద్రవేసి అక్కడ టెస్టులు చేయించకుండా ఎందుకు అడ్డుకున్నారనేది మరో సందేహం. రమేష్ ఆస్పత్రిలో టెస్టులు చేయించకుండా ఉండేందుకు కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారు. రమేష్ ఆస్పత్రికి తరలిస్తే రిపోర్టుల్లో తేడా వస్తాయని భయపడ్డారనే విమర్శలు రావడానికి ఇది కారణం అయింది. పరిస్థితి సీరియస్ అయిన తర్వాత వైసీపీ నేతలు ఎప్పట్లాగే చంద్రబాబుపై ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన చెబితేనే రఘురామరాజు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. మెడికల్ రిపోర్టులో … సీఐడీ పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని తేలితే పరిస్థితులు శరవేగంగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close