తమిళులకు టార్గెట్ అయిన సమంత..!

సమంత తమిళనాడులో సెగలు రేపుతున్నారు. అయితే గ్లామర్‌తో కాదు. ఈ సారి సీరియస్ ఇష్యూతో. ఆమెకు పుట్టి పెరిగిన తమిళనాడు నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్ వెబ్ సీరిసే. బుధవారం ట్రైలర్ విడుదల కాగానే తమిళులు సోషల్ మీడియాలో ఫైర్ అవడం ప్రారంభించారు. ట్రైలర్‌ ప్రకారం సమంత.. ఒక తమిళ ఆత్మాహుతి దళ సభ్యురాలిగా కనిపిస్తున్నారు. అందరినీ చంపేస్తానని డైలాగ్స్ కూడా ట్రైలర్‌లో ఉన్నాయి.

చూడటానికి డిటెక్టివ్ స్టోరీగా కనిపించినా.. అందులో శ్రీలంక తమిళుల కథ అని,… రాజీవ్ గాంధీ హత్యలో పాలు పంచుకున్న ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యురాలు థానును పోలిన క్యారెక్టర్‌ సమంతదని రివ్యూలు రాసేస్తున్నారు. శ్రీలంక తమిళుల చరిత్రను వక్రీకరించడమే కాకుండా.. చరిత్ర తెలియని వారు ఈ సిరీస్ తీస్తున్నారని తమిళ మేథావుల ఆరోపణ. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్‌ను తమిళులు.. స్వాతంత్ర సమరయోధుడిగా భావిస్తున్నారని, వెబ్‌ సిరీస్ నిర్వాహకులు మాత్రం ఆయన్ను ఉగ్రవాదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళనాడు నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్.

తమిళనాడులో పుట్టి పెరిగిన సమంత తమిళుల చరిత్ర తెలిసి కూడా.. ఇలాంటి వెబ్ సరీస్‌లో ఎలా నటిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. షేమ్‌ ఆన్ యూ.. అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి…. ది ఫ్యామిలీ మ్యాన్ టూ.. వెబ్‌ సిరీస్ యూనిట్‌పై విరుచుకుపడుతున్నారు. తమిళులందరూ… అమెజాన్ ప్రైమ్‌ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై సమంత కానీ అమెజాన్ కానీ ఇంకా స్పందించలేదు. వివాదం మరింత ముదిరిన తర్వాత ఏమైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close