నిర్మాత‌ల్ని టెన్ష‌న్‌లో పెట్టేసిన రాజ‌మౌళి

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. మ‌రీ ముఖ్యంగా పెద్ద సినిమాలు. అన్నింటికంటే ముఖ్యంగా రాజ‌మౌళి – ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఎందుకంటే రాజ‌మౌళి సినిమా అంటే అది పంచ వ‌ర్ష ప్ర‌ణాళికే. ఓ రిలీజ్ డేట్ కి క‌ట్టుబ‌డి ఉండ‌డం ఆయ‌న వ‌ల్ల కాదు. త‌న ఆలోచ‌న‌లు, క‌థ‌లు, అన్నీ భారీగానే ఉంటాయి కాబ‌ట్టి – ఆ మాత్రం ఆల‌స్యం, వాయిదాల ప‌రంప‌ర‌కు ఓపిక వ‌హించాల్సిందే.

ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల ప‌లుమార్లు వాయిదా ప‌డింది. అక్టోబ‌రు 13న ఈ సినిమా తీస్తుకొస్తున్నామ‌ని చిత్ర‌బృందం ఎప్పుడో ప్ర‌క‌టించేసింది. అప్పుడు ఈ సినిమా రావ‌డం దాదాపు అసాధ్య‌మే అని చిత్ర‌సీమ‌తో పాటు ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అభిమానులు కూడా న‌మ్ముతున్నారు. అయితే అనూహ్యంగా ఈ రోజు కొమ‌రం భీమ్ పోస్ట‌ర్ లో రిలీజ్ డేట్ కూడా కనిపించింది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం మ‌రోసారి డంకా బ‌నాయించింది. ఇదేం లాజిక్కో సినీ జ‌నాల‌కు అర్థం కావ‌డం లేదు.

నిజానికి.. క‌రోనా మ‌హ‌త్తు వ‌ల్ల అన్ని సినిమా డేట్లూ వాయిదా ప‌డుతూ వెళ్తున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు. అక్టోబ‌రు 13 అని ప్ర‌క‌టించినా, విడుద‌ల తేదీ మార్చే ఛాన్సుంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అక్టోబ‌రు 13న ఏర్ప‌డిన ఖాళీని పూడ్చాల‌ని పుష్ష లాంటి సినిమాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. పుష్ష ఆ టైమ్ కి వ‌చ్చినా రాక‌పోయినా, కొన్ని సినిమాలు అక్టోబ‌రు 13ని టార్గెట్ చేశాయి. ఆర్‌.ఆర్‌.ఆర్ ఎలాగూ సంక్రాంతికే వ‌స్తుంద‌ని భావించిన నిర్మాత‌లు – ఆ స‌మ‌యంలో త‌మ సినిమా లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాయి. అలా ఆర్‌.ఆర్‌.ఆర్ రిలీజ్ డేట్ పై చాలా సినిమాలు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార ప‌డ్డాయి. ఇప్పుడు వాట‌న్నింటినీ మ‌ళ్లీ క‌న్‌ఫ్యూజ‌న్ లో ప‌డేశాడు రాజ‌మౌళి. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డానికి మ‌రో రెండు నెల‌లైనా ప‌డుతుంది. అప్పుడు వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ ప‌డ‌తాయి. ముందు మార్చి, ఏప్రిల్, మేల‌లో రావాల్సిన సినిమాల‌కు స్లాట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఆ లెక్క‌న అక్టోబ‌రు 13న ఫిక్స‌యిన ఆర్‌.ఆర్‌.ఆర్ కాస్త వెనక్కి వెళ్లాలి. కానీ ఏ ధైర్యంతో రాజ‌మౌళి రిలీజ్ డేట్ మార్చ‌లేదో అర్థం కాదు. సినిమా అంతా సిద్ధంగా ఉండి, పోస్ట్ ప్రొడక్ష‌న్ ఎప్పుడు పూర్త‌వుతుందో రాజ‌మౌళికి ఓ స్ప‌ష్ట‌మైన అంచ‌నా ఉంద‌ని, అందుకే రిలీజ్ డేట్ మార్చ‌లేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వాసులు చెప్పుకుంటున్నారు. రాజ‌మౌళి ఇప్పుడు అక్టోబ‌రు 13నే వ‌స్తాన‌న్నా.. కాదు, కుద‌ర‌దు అని చెప్పేంత సీన్ ఎవరికీ లేదు. ఇష్టం లేక‌పోయినా సైడ్ ఇవ్వాల్సిందే. సో.. అక్టోబ‌రు 13న ఆశ‌లు పెట్టుకున్న  మిగిలిన సినిమాలు ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అన్వేషించాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close