ఆనందయ్యపై “అధికార” రుబాబు..!

కరోనా తగ్గిపోయే మందు ఇస్తున్నారని అందరి నమ్మకాన్ని చూరగొన్న ఆనందయ్య.. చాలా రోజుల పాటు ఉచితంగా మందు ఇవ్వగలిగారు కానీ.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిన తర్వాత ఇవ్వలేకపోతున్నారు. ఆయుర్వేదం పేరుతో నాటు మందులు అమ్ముకునేవాళ్లంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆనందయ్య మాత్రం.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపుగా వారం రోజుల నుంచి ఆయన… వైసీపీ నేతల వద్ద బందీగా ఉన్నారు. ఆయనపై ముందుగా రెండు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాతపోలీస్ బందోబస్తుతో తీసుకెళ్లారు. అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. కానీ ఆనందయ్య రాడేమో అన్న ఉద్దేశంతో ఆ కేసులు నమోదు చేసి తీసుకెళ్లారు. అప్పట్నుంచి వారం రోజుల పాటు వైసీపీ నేతల అధీనంలో ఉన్నారు.

తర్వాత ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆయుర్వేద మందు ఫార్ములా చెప్పమని వేధిస్తున్నారంటూ.. ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఫలితమో.. వైసీపీ నేతలు కావాల్సినంత మందు చేయించుకున్నారో కానీ… చివరికి వదిలి పెట్టారు. దీంతో నెల్లూరు నుంచి ఆయన కృష్ణపట్నం చేరుకున్నారు. గ్రామస్తులు వచ్చి ఆయనను పలకరించారు. ఆయన కృష్ణపట్నం రాగానే… మరోవైపు సోషల్ మీడియాలో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో ఆయన కంగారు పడి… ఎవరూ రావొద్దని..ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతనే మందు పంపిణీ చేస్తానని ప్రకటించాల్సి వచ్చింది. వెంటనే మళ్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనను నిర్బంధంలోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు.

ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి … చెబుతున్నారని… పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీంతో కృష్ణపట్నం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆందోళనతో ఉన్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఆయనేదో తప్పు చేసినట్లుగా… అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే మీడియా చానళ్లలో ప్రసారం చేయడం కూడా… కుట్రపూరితంగా చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆనందయ్య మందు వల్ల కొంత మంది చనిపోయారంటూ… ప్రముఖ టీవీ చానల్‌లో బ్రేకింగ్‌లు వచ్చాయి. ఇవన్నీ ఆయనను బెదిరించడానికి ఆడుతున్న నాటకంగా చెబుతున్నారు.

మొత్తానికి ఆనందయ్యకు ప్రశాంతత లేకుండా పోయింది. సొంత ఖర్చుతో ఇంత వరకూ మందు తయారు చేసి పంపిణీ చేశారు. ఇప్పుడు.. ఆయన కొంత మందికి వ్యాపార వస్తువు అయిపోయినట్లుగా కనిపిస్తోంది. మరో వైపు మందు కోసం ప్రజలు ఎదురు చూస్తూంటే.. ప్రభుత్వం మాత్రం.. ఆయనతోనే గేమ్ ఆడుతోంది. అదుపులోనే ఉంచుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close