ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌రో ప్ర‌యోగం

అ…తో తొలి అడుగులోనే తనవి విభిన్న‌మైన ఆలోచ‌న‌ల‌ని చాటుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. క‌ల్కి కూడా డిఫ‌రెంట్ జోన‌రే. `జాంబీరెడ్డి`తో జాంబీల‌ను తెలుగు తెర‌పై చూపించొచ్చ‌ని నిరూపించాడు. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇప్పుడు మ‌రో ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు. `హ‌ను – మేన్‌` ద్వారా. తెలుగులో ఇదే తొలి సూప‌ర్ హీరో సినిమా అంటూ ప్ర‌క‌టించేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈరోజు త‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా డిటైల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పురాణాల్లో హ‌నుమంతుడి పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌ర్వ‌తాల్ని సైతం ఒంటి చేత్తో క‌దిలించ‌గ‌ల ధీరుడు. ఓ ర‌కంగా.. పురాణాల్లో క‌నిపించే సూప‌ర్ హీరో తానే. ఇప్పుడు త‌న క‌థ‌నే తెర‌పై చూపిస్తున్నాడా? లేదంటే.. హ‌నుమంతుడి పాత్ర‌లాంటి సూప‌ర్ హీరోని సృష్టిస్తున్నాడా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త త‌ర‌హా సినిమా అయితే చూపించ‌డానికి ప్ర‌శాంత్ వ‌ర్మ రెడీ అయిపోయాడ‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నం.. ప్ర‌యోగం ఎలా ఉంటాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.