శర్వా Vs 14 రీల్స్‌… నిర్మాత వెర్ష‌న్ ఇదీ!

ఎప్పుడూ… ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ల‌ని హీరో శ‌ర్వానంద్‌. త‌న ప‌ని తాను కామ్ గా చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే.. ఇప్పుడు 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో కాస్త గ్యాప్ వ‌చ్చింది. దానికి కార‌ణం.. `శ్రీ‌కారం` ఇష్యూ. ఈ సినిమాకి సంబంధించి శ‌ర్వాకి నిర్మాత‌లు మ‌రో 2 కోట్ల పారితోషికం ఇవ్వాలి. అక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. సినిమా విడుద‌లై ఇన్ని రోజులైనా నిర్మాత‌లు ఆ సొమ్ము శ‌ర్వాకి ఇవ్వ‌లేదు. స‌రిక‌దా.. నిర్మాణ సంస్థ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దాంతో శ‌ర్వా లీగ‌ల్ గా ప్రొసీడ్ అవ్వాల్సివ‌చ్చింది. ఈ స‌మ‌స్య‌ని 14 రీల్స్ సంస్థ కూడా సున్నితంగానే ప‌రిష్కరించుకొందామ‌నుకుంది. అయితే శ‌ర్వాకి 2 కోట్ల పారితోషికం ఇవ్వ‌కపోవ‌డానికి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్లు.. రేజ్ చేస్తోంది నిర్మాణ సంస్థ‌. ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం… శ‌ర్వా వివాదం వెనుక కొన్ని కీల‌క‌మైన పాయింట్లు ఉన్నాయి. అవేంటంటే…

* శ‌ర్వాకి 14 రీల్స్‌… 2 కోట్లు ఇవ్వాల‌న్న‌ది నిజం. అందుకు ఇచ్చిన చెక్ లు కూడా బౌన్స్ అయిన మాట నిజం. ఈ విష‌యంలో 14 రీల్స్ ఎలాంటి దాగుడు మూత‌లూ ఆడ‌డం లేదు. కాక‌పోతే ఆ డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డానికి కాస్త స‌మ‌యం అడుగుతున్నారు.

* `శ్రీ‌కారం` షూటింగ్ ఏమాత్రం స‌వ్యంగా జ‌ర‌గలేదు. మ‌ధ్య‌లో `జాను` షూటింగ్ సంద‌ర్భంగా శ‌ర్వాకి గాయ‌మైంది. ఆ ఎఫెక్ట్ శ్రీ‌కారం సినిమాపై ప‌డింది. శ్రీ‌కారం కూడా ఆల‌స్య‌మైంది. గ‌త యేడాది ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా.. 12 నెల‌లు ఆల‌స్యంగా వ‌చ్చింది.ఈ భార‌మంతా నిర్మాత‌లే మోయాల్సివ‌చ్చింది. శ్రీ‌కారం క్లైమాక్స్ షూటింగ్ అన‌గా… శ‌ర్వా అమెరికా వెళ్లిపోయాడు. త‌ను తిరిగి వ‌చ్చేంత వ‌ర‌కూ.. చిత్ర‌బృందం ఎదురు చూసింది.

* శ్రీ‌కారం విడుద‌లైన టైమ్ ఏమాత్రం బాగాలేదు. ఎందుకంటే సినిమా విడుద‌లైన కొద్ది రోజుల‌కే… లాక్ డౌన్‌, థియేట‌ర్ల మూత‌.. జ‌రిగిపోయాయి. ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు నిర్మాత‌ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇంకా తిరిగి చెల్లించ‌లేదు. అంద‌రి నోటా ఒక‌టే మాట‌.. `క‌రోనా..`. ఇలాంటి ప‌రిస్థితుల్లో నిర్మాత‌ల‌కు రావాల్సిన డ‌బ్బులు చాలా ఆగిపోయాయి. అవొస్తే శ‌ర్వాకి క్లియ‌ర్ చేసేద్దామ‌న్న ఉద్దేశంలో నిర్మాత‌లు ఉన్నారు.

* ఈమ‌ధ్య నిర్మాత‌ల మండ‌లి ఓ ప్ర‌త్యేక తీర్మాణం చేసింది. అదేంటంటే…. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో, నిర్మాత‌లు మ‌ళ్లీ తేరుకోవ‌డానికి క‌నీసం 20 శాతం పారితోషికం త‌గ్గించుకోవాల‌ని సూచించింది. ఆ లెక్క‌న‌.. శ‌ర్వా కూడా పారితోషికం త‌గ్గించుకుని, త‌మ‌కు 2 కోట్ల‌కు వెసులు బాటు ఇస్తాడ‌ని నిర్మాతలు ఎదురు చూశారు. కానీ శ‌ర్వా నుంచి… పాజిటీవ్ రెస్పాన్స్ రాలేదు.

* మ‌రో కీల‌క‌మైన విష‌యం… శ‌ర్వా నిర్మాత‌గా `కో అంటే కోటి` అనే సినిమా వ‌చ్చింది. ఆ సినిమాకి సంబంధించిన ఓ ఏరియా రైట్స్ అప్ప‌ట్లో 14 రీల్స్ తీసుకుంది. దానికి సంబంధించి శ‌ర్వా.. 14 రీల్స్ కి కొంత మొత్తం ఇవ్వాలి. ఆ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేద‌ని తెలుస్తోంది. అందుకే శ‌ర్వాకి ఇవ్వాల్సిన 2 కోట్లు హోల్ట్ లో పెట్టిన‌ట్టు స‌మాచారం. 14 రీల్స్ ఇప్ప‌టికీ…. ఈ వివాదాన్ని సామ‌ర‌స్య‌పూర్వ‌కంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని చూస్తోంది. శ‌ర్వాతో.. మాట్లాడి, ఈ స‌మ‌స్య‌కు పుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటోంది. అందుకు సంబంధించిన‌.. సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close