ఇతర రాష్ట్రాల టీకాల గ్లోబల్ టెండర్లకు స్పందన..!

ఆంధ్రప్రదేశ్ టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ప్రి బిడ్ సమావేశానికి రెండు కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు. ప్రిబిడ్ భేటీకి వచ్చారంటే.. వారికి టీకాలు సరఫరా చేసే ఉద్దేశం ఉన్నట్లే లెక్క. కానీ ఏపీ సర్కార్.. తమకు బిడ్లు దాఖలు కాలేదని… తమకే కాదని.. ఏ రాష్ట్రానికీ బిడ్లు దాఖలు కాలేదని.. సీఎం జగన్… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది… అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తొమ్మిది రాష్ట్రాలు మొత్తంగా గ్లోబల్ టెండర్లు పిలిస్తే.. ఒక్క ఏపీకి మాత్రమే ఒక్క టెండర్ దాఖలు కాలేదు. మిగిలిన అన్ని రాష్ట్రాలకూ… స్పందన వచ్చింది. చివరికి తెలంగాణకుకూడా.. రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. మహారాష్ట్రకు ఎనిమిది కంపెనీలు స్పందించాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించింది. కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. కొన్ని అంతర్జాతీయ, వివిధ దేశాల కంపెనీలు స్పందించాయి. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ తయారీదారులు టెండర్లు వేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 కంపెనీలకు పైగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంటే… కేవలం రెండు మూడు కంపెనీలు మాత్రమే గ్లోబల్ టెండర్లలో పాల్గొంటున్నాయి. సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన కంపెనీలు గ్లోబల్ టెండర్లలో పాల్గొనే లాగా ప్రచారం కల్పించాలని, ఆయా కంపెనీలు కూడా సమాచారం చేరేలా చూడాలని ఆదేశించారు.

తమిళనాడు ప్రభుత్వం చైనా వ్యాక్సిన్‌ సరఫరాకు కూడా అంగీకారం తెలిపింది. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల గ్లోబల్ టెండర్లకు… పలు సంస్థలు ఆసక్తి చూపాయి. వాటి నుంచి ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేస్తాయా .. వాటికి కేంద్రం అనుమతి ఇస్తుందా.. అన్నది తర్వాత విషయం. కానీ.. జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో ..తమకు స్పందనరాలేదు కాబట్టి.. ఇతర రాష్ట్రాలకు రాలేదన్నట్లుగా రాయడం .. ఆశ్చర్యకరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close