బండి సంజయ్‌కు చెక్ పెట్టడానికే ఈటలకు ఆహ్వానమా..!?

బీజేపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఈటల రాజేందర్‌కు భారీ హామీలు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీని వెనుక పెద్ద కథ జరిగిందని బీజేపీలోనే చర్చ జరుగుతోంది. ఈటలను పార్టీలో చేర్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. కేంద్ర పెద్దల్ని ఒప్పించారు . దీనికి కారణం…బీసీ నినాదంతో పాటు…పార్టీలో దూకుడుగా ఉంటూ… పట్టు పెంచుకుంటున్న బండి సంజయ్‌కు చెక్ పెట్టడమేనంటున్నారు. బండి సంజయ్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. ఈటల కూడా అదే జిల్లా. దీంతో.. బండి సంజయ్ ప్రాధాన్యం ఆటోమేటిక్‌గా తగ్గుతుందని.. ఈటలకు ప్రాధాన్యం పెరుగుతుందని .. కిషన్ రెడ్డి తన పట్టు నిలుపుకుంటారని.. విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత చాలా దూకుడుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. దీంతో అధ్యక్షుడు బండి సంజయ్ ఇమేజ్ పార్టీలో అమాంతం పెరిగింది. నేరుగా ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి అభినందించారు. అయితే తర్వాత జరగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని సైతం బీజేపీ కోల్పోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ‌కి డిపాజిట్ దక్కలేదు. మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. దీంతో బండి సంజయ్ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే బలమైన గ్రూప్‌ మరింతదూకుడు పెంచింది.

ఢిల్లీలో కిషన్ రెడ్డి కీలక పొజిషన్‌లో ఉండటంతో… ఆయన వర్గం వారికే పనులు అయ్యేలా ఢిల్లీలో వ్యవహారాలు చక్క బెడుతున్నారు. బండి సంజయ్‌ సన్నిహితులు అనుకున్న వారికి పార్టీ పెద్దల దర్శనం దక్కడం లేదు. ఈటల ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన వెంట వివేక్ ఉన్నారు కానీ. బండి సంజయ్‌కు కనీస సమాచారం లేదు. పరిస్థితుల్ని గమనించి కొంత మంది నేతలు.. బండి సంజయ్ క్యాంప్ నుంచి కిషన్ రెడ్డి క్యాంప్‌కు వెళ్తున్నారు. బీసీకి చెక్ పెట్టేందుకే మరొక బీసీని పార్టీలోకి తీసుకొస్తున్నారని ఫైనల్‌గా బీజేపీలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ పోరాటంలో ఎవరు నిలబడతారో కానీ.. అంతిమంగా కిషన్ రెడ్డి రాజకీయం గెలుస్తుందని.. ఆయన వర్గీయులు అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close