అమూల్ కోసం పైసా కూడా ఖర్చుపెట్టొద్దన్న హైకోర్టు..!

గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థను ఏపీలో ప్రమోట్ చేస్తున్న సీఎం జగన్‌కు.. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఏపీ డెయిరీకి సంబంధించిన రూ. మూడు, నాలుగు వేల కోట్ల విలువైన ఆస్తులను.. చాలా తక్కువ మొత్తానికి లీజుకిచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసేసుకుని.. జీవో కూడా ఇచ్చేసిన సమయంలో… ఆ సంస్థ కోసం ప్రజాధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రజాధనాన్ని అప్పనంగా అమూల్‌కు కట్ట బెడుతున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జరిగిన విచారణ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నిజానికి ప్రభుత్వం తన వాదన వినిపించి ఉంటే.. ఈ ఉత్తర్వులు వచ్చాయో రావో కానీ.. ఇంతకు ముందు విచారణలో ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్ రిజిస్ట్రీ వద్ద కనిపించలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. పధ్నాలుగో తేదీ వరకూ.. అమూల్ కోసం.. ఎలాంటి నిధులూ ఖర్చు చేయవద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి అమూల్‌కు గోదావరి జిల్లాల్లోనూ రాచబాట వేస్తూ.. జగన్ ఈ రోజే పాలసేకరణను తన చేతుల మీదుగా ప్రారంభించారు. పాడి రైతులకు పెద్ద ఎత్తున లాభం ఇస్తారని.. అమూల్ పైసా కూడా లాభం తీసుకోకుండా.. రైతుల కోసం పని చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. ఏపీ పాడి రైతులను అమూల్‌కు తాకట్టు పెడుతున్నారు.. ఏపీడెయిరీకి చెందిన వేల కోట్ల ఆస్తులను అతి స్వల్ప మొత్తానికి లీజుకిచ్చి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

ఇదో పెద్ద స్కాం అంటున్నారు. అన్ని వేల కోట్ల ఆస్తులు అప్పనంగా అప్పజెబుతున్నప్పుడు… రివర్స్ టెండర్లు.. జ్యూడిషియల్ రివ్యూలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుతో పాటు అమూల్ సంస్థకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అమూల్‌ గుజరాత్‌కు చెందిన సహకార సంస్థ. ఏపీలో చాలా సహకార డెయిరీలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ.. అమూల్‌ను ప్రభుత్వం ప్రమోట్ చేయడం వెనుక గూడుపుఠాణి ఉందన్న అనుమానాలు కొద్ది రోజుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు విచారణతో అవి బయటకు వస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close