మోడీ టీంలో మార్పుచేర్పులు..! ఏపీకి చోటు దక్కుతుందా..?

రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కేంద్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయడం బీజేపీ అధినాయకత్వం చేసే ప్రక్రియ. ఈ సారికూడా అలాంటి ప్రక్రియే ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ.. మంత్రుల పనితీరును సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షల్లో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా…బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటున్నారు. పనితీరు నాసిరకంగా ఉన్న వారినితప్పించి.. కొత్త వారికి చాన్సివ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం నిబంధనల ప్రకారం… భర్తీ చేసుకోగలిగిన మంత్రి పదవులు ఖాళీగా ఇరవైకిపైగానే ఉన్నాయి. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ… ఆ తర్వాత మరోసారి విస్తరణ చేపట్టలేదు.

వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ,పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల కీలక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని…భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. కేంద్రమంత్రి పదవులను ఆశచూపి.. గత రెండేళ్ల కాలంలో చాలా మందిని బీజేపీలోకి చేర్చుకున్నారు. చాలా రాష్ట్రాల నుంచి ఇలా చేరిన వారు ఉన్నారు. వారికిచోటు కల్పించాల్సి ఉంది. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాల నేతలకు మరింత అధికార బలం కల్పించాల్సి ఉంది. వీటిపై ప్రస్తుతం మోడీ, అమిత్ షా దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాలకు మంత్రివర్గంలో చోటు ఉంది.కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేంద్రమంత్రి ఎవరూ లేరు. బీజేపీకి కానీ.. మిత్రపక్షాలకు కానీ ఎంపీలు ఎవరూ లేకపోవడం… మొదట్లో చోటు కల్పించలేకపోవడానికి ఓ కారణం అనుకున్నారు. అయితే ఆ తర్వాత టీడీపీ ఎంపీల్ని చేర్చుకున్నారు. బీజేపీలో విలీనం చేసుకున్నారు. సుజనా చౌదరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని అప్పుడే ప్రచారం జరిగింది.కానీ ఏం జరిగిందో కానీ.. మొత్తం సైలెంట్ అయిపోయింది. ఏపీకి ఒక్క కేంద్రమంత్రి కూడా లేకపోవడం వల్ల… రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ అసమానతను ఈ సారి విస్తరణలో అయినా ప్రధానమంత్రి సరి చేస్తారో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close