రఘురామరాజుపై వేటే లక్ష్యంగా టూర్..!?

రఘురామకృష్ణరాజును లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయించాలన్న ఎజెండా ప్రధానంగా సీఎం జగన్ పర్యటనలో ఉన్నట్లుగా తదుపరి పరిణామాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఇలా.. ఢిల్లీ పర్యటన ముగించుకుని అమరావతికి ప్రత్యేక విమానం ఎక్కగానే … వైసీపీ ఎంపీ … వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గానికి భరత్.. స్పీకర్ వద్దకు వెళ్లారు. రఘురామకృష్ణరాజు లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ.. గతంలోనే సాక్ష్యాలు సమర్పించామని మార్గాని భరత్ చెప్పుకొచ్చారు.

అమిత్ షా వద్ద జగన్ ప్రధానంగా… రఘురామకృష్ణరాజు లోక్‌సభ సభ్యత్వం గురించే ప్రస్తావించారని.. అందుకే.. కొత్తగా భరత్ మళ్లీ ఫిర్యాదు చేశారన్న టాక్ ఢిల్లీలో నడుస్తోంది. ఈ అంశంపై అమిత్ షా భరోసా ఇచ్చినందునే… ఓ అడుగు ముందుకు వేశారని కూడా చెబుతున్నారు. అయితే.. అలా.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం లేదని న్యాయనిపుణుల్లో చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల్లో అధికారికంగా చేరితేనే.. లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. పార్టీకి దూరమైనా… అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా… లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయకపోవచ్చంటున్నారు. నిజంగా అలా రద్దు చేయాల్సి వస్తే..ఏపీలో టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకున్నా.. చేర్చుకోనట్లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ముందుగా అనర్హతా వేటు వేయాలని గుర్తు చేస్తున్నారు.

ఇక్కడ వైసీపీ చేస్తున్న పని … ఢిల్లీ వర్గాలకు తెలియకుండా ఉంటుందా .. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో వైపు రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు నేరుగా… ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. తనపై జరిగిన ధర్డ్ డిగ్రీ ప్రయోగంపై చెప్పాల్సిన వారందరికీ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ హామీల గురించి లేఖలు రాస్తున్నారు. రఘురామరాజు లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయిస్తే.. ఆయనను పట్టించుకునే వారు ఉండరని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close