శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌` అనేది ఉప‌శీర్షిక. విష్ణు క‌థానాయ‌కుడు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈలోగా మ‌రో రెండు క‌థ‌ల్ని రెడీ చేశాడు. `డ‌బుల్స్‌` అనే టైటిల్ తో శ్రీ‌నువైట్ల ఓ స్టోరీ రాసుకున్నాడు. ఇదో మ‌ల్టీస్టార‌ర్‌. ఇందులో ఇద్ద‌రు హీరోలుంటారు. `డీ అండ్ డీ` కీ `డ‌బుల్స్` కీ మ‌ధ్య మ‌రో సినిమా ఉంటుంది. డ‌బుల్స్ లో స్టార్ హీరోలే క‌నిపిస్తార‌ని స‌మాచారం. అయితే ఇంత వ‌ర‌కూ.. ఆ హీరోలెవ‌ర‌న్న‌ది తెలీదు. శ్రీ‌నువైట్ల కూడా.. `హీరోల గురించి ఏం అనుకోలేదు. క‌థ అయితే రెడీగా ఉంది. డీ అండ్ డీ త‌ర‌వాత‌.. మ‌రో సినిమా ఉంటుంది. ఆ త‌ర‌వాతే… డబుల్స్ సెట్స్‌పైకి వెళ్తుంది` అన్నారు. ఈమ‌ధ్య సోష‌ల్ మీడియాలో శ్రీ‌నువైట్ల పై ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్‌, చిరుల‌తో శ్రీ‌నువైట్ల ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం. వాటిని కొట్టిప‌రేశాడు శ్రీ‌నువైట్ల‌. `ఆ వార్తల్లో నిజం లేదు` అని క్లారిటీ ఇచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close