జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు ప్రెస్‌మీట్లలో చెప్పుకోవడానికి జనసేనతో పొత్తు అనే పదాన్ని వినియోగిస్తున్నారు కానీ.. వాస్తవంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో మాత్రం జనసేనను భాగం చేయడం లేదు. వారితో కనీసం సమాచారం పంచుకోవడం లేదు. దీనికి ఉదాహరణ.., తాజాగా ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన నిరసన.

ఆదివారం విజయవాడలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి… జనసేనతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కానీ అది ప్రకటనకే పరిమితం. జనసేన నేతలకు కనీస సమాచారం పంపలేదు. తమంతటకు తాము ధర్నాలు చేసేశాం అనిపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అన్నవచ్చాడు.. పన్నులు పెంచాడు అంటూ.. రాజమండ్రిలోనే నిరసన వ్యక్తం చేశారు. నేతలున్న చోట.. ఆసక్తి ఉన్న చోట ధర్నాలు చేశారు. బీజేపీ తీరుపై జనసేన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని గతంలోనే బీజేపీ, జనసేన నేతలు కలసి ఈ మేరకు నిర్ణయించారు. ఇప్పుడు బీజేపీ నేతలు వాటిని పట్టించుకోవడం లేదు.

బీజేపీ నేతలు ఆహ్వానించకపోవడం తమకే మంచిదని కొంత మంది బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే పొత్తులు పెట్టుకుని.. అవసరమైనప్పుడు పవన్ కల్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకుంటూ… బండి నడిపించేస్తున్న బీజేపీ… ఢిల్లీ నుంచి మాత్రం.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి పదవి అంటూ.. మీడియాకు లీకులు ఇస్తోంది. అయితే.. అది సాధ్యం కాదని ఏపీ బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అందుకే వారూ పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close