ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏపీ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తోందని నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. అదీ కూడా ఆషామాషీగా చేయలేదు. అన్ని లెక్కల వివరాలను చాలా స్పష్టంగా తెలుసుకుని.. ఎంత అప్పులు చేయాలి.. ఎంత చేస్తున్నారు… వంటి అంశాలన్నింటినీ.. లెక్కలు చెప్పి మరీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ లేఖ… ఏపీ ఆర్థిక శాఖలోనే కాదు.. ఢిల్లీలోనూ కలకలం రేపుతోంది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ.. ఏపీ సర్కార్ అప్పులు తెస్తోందని.. ఇందు కోసం.. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేషన్‌కు బదిలీ చేసి తాకట్టు పెడుతోందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని.. ఉచిత పథకాలకు మరో 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదిస్తోందని గుర్తు చేశారు. పరిమితికి మించి చేసిన అప్పుల కారణంగా వచ్చే ఏడాది నుంచి 35 వేల కోట్లు కేవలం వడ్డీ గా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలకు సగటున 9,226 కోట్ల అప్పులు చేసిందని విచక్షణరహితంగా చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడితప్పిందని తక్షణం జోక్యం చేసుకోవాలని రఘఉరామ ప్రధానని కోరారు.

కేంద్రంతో వైసీపీకి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో.. రుణాలతో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన లోటు నిధులు.. ఇతర విషయాల్లో కేంద్రం బాగానే సహకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన నిధులను దారి మళ్లించినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్నీ తెలిసినా… రఘురామకృష్ణరాజు.. కేంద్రానికిలేఖ రాశారు. ఒక వేళ.. ఆ లేఖను ప్రధాని పరిశీలించాలని ఆర్బీఐకో.. ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకో పంపితో.. వారు వివరాలు సేకరిస్తారు. అప్పుడు.. కొంత అలజడి రేగడం ఖాయమని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close