సీఐడీ పోలీసుల వ్యూహంలో చిక్కుకున్న రఘురామ..!

రఘురామకృష్ణరాజును మళ్లీ గుంటూరు రప్పించేందుకు సీఐడీ పోలీసులు తమ శక్తినంతా ఉపయోగిస్తున్నారు. ఆయన పూచికత్తులను ఆమోదించడానికి సాంకేతిక కారణాలు వెదుక్కుంటున్నారు. ఫలితంగా.. రఘురామకృష్ణరాజు అనధికారికంగా విడుదలై వెళ్లిపోయారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. అనూహ్యంగా బుధారం..రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన రఘురామకృష్ణరాజుకు రిమాండ్ విధించడం ఏమిటని చాలా మందికి ఆశ్చర్యం వేసింది. తర్వాత అసలు విషయం అర్థం కావడంతో.. సీఐడీ ఇప్పటికీ.. ఆయనపై కొత్తకొత్తవ్యూహాలు అమలు చేస్తోందని విశ్లేషిస్తున్నారు.

రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసినసుప్రీంకోర్టు విడుదలైన పది రోజుల్లో బాండ్లు సమర్పించమని ఆదేశించింది. ఆ మేరకు ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఢిల్లీ వెళ్లిపోయిన ఎంపీ తరపున… మూడు రోజుల తర్వాత ఆయన లాయర్లు బాండ్లు సమర్పించారు. వాటిని కోర్టు సీఐడీ అధికారులకు పంపింది. బెయిల్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇక్కడే తెలివి తేటలు ప్రదర్శించారు. వాటిని ఆర్మీ ఆస్పత్రికి పంపారు. ఆయన డిశ్చార్జ్ అయ్యారని తెలిసి కూడా పంపారు. దీంతో ఆర్మీ ఆస్పత్రి వాటిని మళ్లీ వెనక్కి పంపింది. ఆ తర్వాత సీఐడీ సైలెంట్‌గా ఉండిపోయింది.ఫలితంగా కోర్టు మరోసారి రిమాండ్ విధించింది.

రఘురామను మళ్లీ గుంటూరు రప్పించే వ్యూహాన్ని సీఐడీ అధికారులు అమలు చేస్తున్నారని ఆయన తరపు లాయర్లు అంటున్నారు. రఘురామరాజు.. ఆర్మీ ఆస్పత్రి నుంచే తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తూ.. ఓ ప్రణాళికప్రకారం..డిశ్చార్జ్ అయిపోయి..ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆయన ఫిర్యాదు వల్ల గుంటూరు అర్బన్ ఎస్పీని బదిలీ చేశారు. ఈ క్రమంలో రఘురామను వదిలి పెట్టేది లేదని.. ఏ సందు దొరికినా మళ్లీ పిలిపిస్తామని సీఐడీ. … తాజా చర్యల ద్వారా నిరూపిస్తోందని అంటున్నారు. ఈ కేసు మళ్లీ అనూహ్యమైన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close