టీటీడీలో అంతే..! ఉచితం వద్దని కోట్లకు సేవల కాంట్రాక్ట్..!

ఉచితంగా సేవ చేసేందుకు అనేక మంది క్యూలో ఉంటే… ఉచితంగా అక్కర్లేదు డబ్బులిచ్చి చేయించుకుంటామని వేరే కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చే వాళ్లు ఎవరైనా ఉంటారా..? . ఇతరుల సంగతేమో కానీ.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం ఈ ఘనకార్యం చేశారు. కొండపై భక్తులకు సేవలు అందించే అన్ని చోట్లా…ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్‌కు ఇచ్చేశారు. ఇప్పటి వరకూ ఆయా సేవలు.. బ్యాంకులు ఇతర సంస్థలు తమ సొంత ఖర్చుతో శ్రీవారికి భక్తి పూర్వకంగా చేస్తూ వస్తున్నాయి. హఠాత్తుగా ఏమయిందో కానీ.. టీటీడీ వారందర్నీ తొలగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కంపెనీకి ఆ సేవలను అందించాలని కాంట్రాక్ట్ ఇచ్చింది.

తిరుమలలో భక్తులకు సేవలు అందించేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తూంటాయి. అయితే కాంట్రాక్టుల కోసం కాదు.. ఉచితంగా సేవ చేయడానికి ముందుకు వస్తాయి. అక్కడ భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి చేసినట్లేనని భావించడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకూ అలాంటి సేవలు టీటీడీ తీసుకుంటూ వస్తోంది. లడ్డూ కౌంటర్లు, టిక్కెట్ల జారీ.. ఇతర సేవలు మొత్తం బ్యాంకులు ఇతర సంస్థలు ఉచితంగా అందిస్తూ వస్తున్నాయి. వారి సేవలపై ఎప్పుడూ పెద్దగా ఆరోపణలు రాలేదు. ఎందుకంటే.. వారు సేవలు అందించినప్పటికీ.. వారిపై టీటీడీ విజిలెన్స్ నిఘా ఉంటుంది. కానీ హఠాత్తుగా టీటీడీ అందర్నీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సహజంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం టీటీడీ బోర్డు లేదు. స్పెసిఫైడ్ అధారిటీ ఉంది. గత బోర్డు తీసుకున్న నిర్ణయమో.. లేకపోతే.. ఈవోనే సొంతంగా తీసుకున్నారో కానీ.. ఈ నిర్ణయం వల్ల టీటీడీపై ఐదు కోట్ల రూపాయల భారం పడే అవకాశం కనిపిస్తోందని విపక్ష పార్టీల నేతలు మండి పడుతున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష నేత చంద్రబాబు కూడా రాజకీయ స్వార్థాల కోసం టీటీడీని వాడుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆదాయం కూడా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత సేవలు వద్దని కోట్లు పెట్టి కాంట్రాక్ట్ కంపెనీకి అప్పగించడం ఏమిటన్న విమర్శలు సామాన్య భక్తుల నుంచీ వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close