జడ్జిలపై దూషణల కేసు.. సీఐడీకే కాదు సీబీఐకీ ఇంట్రెస్ట్ లేదు..!

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు నింపాదిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏడాది దాటిపోయినా ఇంకా మూడు నెలల సమయం కావాలంటూ తాజాగా హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. గతంలో సీబీఐకి ఇచ్చిన గడువు అయిపోవడంతో ఈ రోజు విచారణ జరిగింది. ఇప్పటికే మూడు స్టేటస్‌ రిపోర్టులు దాఖలు చేశామని.. తుది నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు మరో మూడు నెలల సమయం ఇచ్చింది. చీఫ్ జస్టిస్‌గా జేకే మహేశ్వరి ఉన్నప్పుడు.. ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయన్న ఉద్దేశంతో న్యాయమూర్తులపై వైసీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దాడి చేశారు.

ఓ పోస్టులో అయితే గదిలో వేసి నరికేస్తామని చెప్పారు. వారికి తోడు.. వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కోర్టులపై అనుమచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు సైతం ఉద్దేశాలు ఆపాదించేలా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. వీటన్నింటిపై హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. కేసులు పెట్టారు. అయితే … సీఐడీ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. చివరికి.. హైకోర్టు సీఐడీకి దర్యాప్తు చేసే ఉద్దేశం లేదని అనుకుందో ఏమో కానీ.. సీబీఐకి ఇచ్చింది. కొంత మంది విదేశాల్లో ఉండి పోస్టులు పెట్టడం.. విదేశాల్లో ఉండి న్యాయమూర్తుల్ని చంపుతామని బెదిరించడం వంటి వీడియోలు ఉన్న కారణంగా సీబీఐకి ఇస్తున్నట్లుగా హైకోర్టు తెలిపింది.అప్పట్నుంచి సీబీఐ విచారణ జరుపుతూనే ఉంది. కానీ ఏమీ తేల్చడం లేదు.

ఓ సారి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు నోటీసులు ఇచ్చారు. అంత వరకే బయటకు తెలిసిన విచారణ సాగింది. ఓ పద్దతి ప్రకారం.. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిలింగ్ చేయడానికి సోషల్ మీడియాను వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గట్టిగా విచారణ జరిగితే.. ఆ సోషల్ మీడియా నెట్ వర్క్ అంతా బయటకు వస్తుందన్న చర్చలు ఉన్నాయి. కానీ ఎందుకో కానీ సీబీఐ నెలల తరబడి గడువు తీసుకుంటూనే ఉంది. ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించిన అన్ని కేసుల్లోనూ ఇదే పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close