ఆ చట్టమే లేకపోయినా కేసులు..! ఇంత దారుణమా..?

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కారణం చెప్పి అరెస్టులు చేయడం.. కేసులు పెట్టడం దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల మరీ ఎక్కువగాఉంది. ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడల్లా.. 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రచారంలోకి వస్తుంది. ఆ తీర్పు ప్రకారం.. సోషల్ మీడియాలో అభ్యంతరక పోస్టులు పెట్టారంటూ.. కేసులు పెట్టే ఐటీ యాక్ట్ 66A కింద కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ సెక్షన్లనే రద్దు చేసింది. ఇలా రద్దు చేసి ఆరేళ్లవుతోంది. కానీ ఆ సెక్షన్ల కింద కేసులు పెట్టడం మాత్రం ఆగడం లేదు. ఆరేళ్ల కాలంలో వెయ్యి కేసులకుపైగా నమోదయ్యాయి.

దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ విషయం తెలుసుకుని సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన చట్టం కింద.. వేల కేసులు నమోదవుతూంటే… ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని… సుప్రీంకోర్టు ధర్మాసనానికి అనుమానం వచ్చింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నిజానికి చట్టం రద్దయినప్పటికీ.. చాలా ప్రభుత్వాలు రాజకీయంగా వ్యతిేక పోస్టులు పెట్టారన్న కారణంగా ఆ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు రావడంతో 2019లో కూడా ఓ సారి సుప్రీంకోర్టు ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని ఆదేశించింది.

కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. నిస్సంకోచంగా కేసులు పెడుతూనే ఉన్నారు. అరెస్టులు చేస్తూనే ఉన్నారు.భావప్రకటనా స్వేచ్చను ప్రభుత్వాలు అడ్డుకోవడానికి అదో సాధనంగా మారింది. తమ పార్టీ వారు ఇతరులను ఎన్నెన్ని మాటలైనా అనొచ్చు కానీ.. తమను అంటే మాత్రం కేసులు పెట్టమని పోలీసుల్ని పురమాయిస్తున్నారు. సుప్రీంకోర్టు హెచ్చరికలతో అయినా దేశంలో మార్పు వస్తుందో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close