ఎక్స్‌క్లూజీవ్‌: RRR లో పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్‌

పున‌ర్జ‌న‌ల కాన్సెప్ట్ రాజ‌మౌళికి బాగా క‌లిసొచ్చిన‌ట్టుంది. `మ‌గ‌ధీర‌` పున‌ర్జ‌న్మ క‌థే. `ఈగ‌` కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్. ఇప్పుడు RRR లో కూడా రాజ‌మౌళి ఇదే నేప‌థ్యం ఎంచుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్‌ల మ‌ల్టీస్టార‌ర్ ఇది. కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా… చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి వీరిద్ద‌రివీ వేర్వేరు ప్రాంతాలు, నేప‌థ్యాలు. అయినా వాళ్లిద్ద‌రూ క‌లిస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది రాజ‌మౌళి ఊహ‌. క‌థంతా… క‌థంతా స్వాతంత్య్రానికి పూర్వం జరుగుతుంది. ఈ క‌థ‌లో అల్లూరి, కొమ‌రం భీమ్ ఇద్ద‌రూ చ‌నిపోతారని, మ‌ళ్లీ పున‌ర్జ‌న్మ ఎత్తుతార‌ని తెలుస్తోంది. పున‌ర్జ‌న్మ కాన్సెప్ట్ క్లైమాక్స్‌కి ముందే జ‌రుగుతుంద‌ని, ఆ ఎపిసోడ్ చాలా ఆసక్తి క‌రంగా ఉంటుంద‌ని స‌మాచారం. భార‌త‌దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి వచ్చిన త‌ర‌వాత‌.. ఈ దేశ ప‌రిస్థితి ఏమిటి? కొమ‌రం భీమ్, అల్లూరి సీతారామ‌రాజు మ‌రో జ‌న్మ ఎత్తి, మ‌ళ్లీ క‌లుసుకుంటే ఎలా ఉంటుంద‌న్న అంద‌మైన ఊహ‌తో ఈ క‌థ ముగుస్తుంద‌ని, ఆ స‌న్నివేశాలు భావేద్వేగంగా, ఆస‌క్తిక‌రంగా సాగుతాయ‌ని, ఓర‌కంగా RRR కి కాస్త దారి వ‌దులుతూ క్లైమాక్స్ ఉంటుంద‌ని తెలుస్తోంది. RRR సీక్వెల్ దాదాపుగా ఉండ‌దు కానీ…. ఉండొచ్చేమో.. అన్న ఆలోచ‌న మాత్రం ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రిలోనూ ర‌గిలించేలా రాజ‌మౌళి ఆ క్లైమాక్స్ తీర్చిదిద్దాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు …విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని...

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

HOT NEWS

css.php
[X] Close
[X] Close