నెలాఖరే డెడ్‌లైన్..! లేకపోతే పవన్ “రైతు సౌభాగ్య దీక్ష -2”..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలాఖరు వరకు ఏపీ సర్కార్‌కు డెడ్‌లైన్ పెట్టారు. ఆ రోపు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలన్నీ చెల్లించకపోతే.. ఇక ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలోనూ ఇలా బకాయిలు చెల్లించకపోతే.. తాను కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేయాల్సి వచ్చిందిని అప్పటికీ కానీ బకాయిలు ఇవ్వలేదని.. ఇప్పుడు కూడా… అదే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. అసలు రైతుల వద్ద నుంచి ఎంత మొత్తంలో ధాన్యం సేకరించారు.. ఎంత మొత్తం బకాయిలున్నాయో వివరాలను ఎందుకు దాచి పెడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నిజానికి ఈ వివరాలన్నీ పారదర్శకమే. వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌లో ఉండాలి. కానీ ప్రభుత్వం అనూహ్యంగా తొలగించింది.

ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి.. ప్రభుత్వం తప్పు చేస్తోందన్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 1800 కోట్ల బకాయిలు ఉన్నారని గుర్తు చేశారు . ఆరు గాలం శ్రమించి పండించిన పంటను తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే రైతులకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అలాగే మొక్కజొన్న పంటను వైసీపీ నేతల వద్దే కొనుగోలు చేస్తున్నారని.. రైతులకు పార్టీల రంగులు పూయడం ఏమిటని.. పవన్ ఫైరయ్యారు. నిరుద్యోగులకు అండగా… యువతతో కలిసి ఉద్యమాలు చేస్తున్న జనసేన.. తాజాగా… పంటల బకాయిలపై దృష్టి పెట్టింది.

ఇటీవల కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి.. నెలాఖరు లోపు.. అందరికీ ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లింపులు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు… పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వానికి నెలాఖరు వరకే గడువు పెట్టారు. ఆ లోపు ప్రభుత్వం మాట నిలబెట్టుకుని నిధులు చెల్లించకపోతే… పవన్ కల్యాణ్ ప్రత్యక్ష దీక్షలకు దిగే అవకాశం ఉంది. గతంలో మాదిరి రైతు సౌభాగ్య దీక్ష -2 చేయవచ్చని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close