దమ్మాలపాటికి రిలీఫ్..! ఇన్‌సైడర్ కేసులు ఇక తేలిపోయినట్లే..!?

ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఏపీ సర్కార్‌కు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో పెట్టిన కేసులన్నీ తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పిటిషన్లను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. తాజాగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. నాలుగు వారాల్లో ఆ పిటిషన్‌ను తేల్చాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.

అమరావతి భూముల విషయంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేసి భారీగా లబ్ది పొందారంటూ… ఏసీబీ కేసులు నమోదు చేసింది. రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని ఏసీబీ అభియోగాలు మోపింది. ఏజీ హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశాయడం నేరమని ఏసీబీ తేల్చింది. ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. కేవలం మీడియాలో ప్రచారం చేసి.. పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని దమ్మాలపాటి కోర్టుకు వెళ్లడంతో.. కేసుపై స్టే ఇస్తూ హైకోర్టు గాగ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతేడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో సుప్రీంకోర్టులో విచారణ జరపాల్సిన అవసరం లేదని.. హైకోర్టులోనే తేల్చుకుంటామని.. పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

దీంతో సుప్రీంకోర్టు పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే దమ్మాలపాటిపై ఏసీబీ చేసింది. ఇన్ సైడర్ ఆరోపణలు కావడం.. అలాంటి నేరమేదీ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చేయడంతో… ఈ కేసు నిలబడే అవకాశాలు లేవు. దీంతో ఏపీ ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకుంటుందా..? లేక మళ్లీ ఇన్ సైడర్ ఆరోపణలు కొనసాగిస్తుందా..అనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close