ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ ఉంటారు. టైటిల్ ఏమాత్రం అటూ ఇటుగా ఉన్నా – దొరికేస్తామ‌న్న భ‌యం వాళ్ల‌ది. పెద్ద హీరోలు, క్రేజీ ప్రాజెక్టుల టైటిల్స్ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఆలోచించి పెడుతుంటారు. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ర‌వికిర‌ణ్ (రాజావారు రాణీగారు ఫేమ్‌) ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రానికి ‘రౌడీ జ‌నార్థ‌న్‌’ అనే పేరు ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

విజ‌య్ సినిమాకి ఇలాంటి టైటిల్ ఏమిటా? అని ఆయ‌న ఫ్యాన్స్ సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. పేరు మాసీగా ఉన్నా, క్యాచీగా లేద‌ని, డ‌బ్బింగ్ సినిమాకి పెట్టిన తెలుగు పేరులా ఉంద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. ఇటీవ‌ల ‘ది ఫ్యామిలీ స్టార్‌’లో విజ‌య్ గోవ‌ర్థ‌న్‌గా క‌నిపించాడు. అది ఆయ‌న నాన్న పేరు. ఈ పేరుని ప్ర‌మోష‌న్ల‌లోనూ బాగా వాడారు. అప్పుడు గోవ‌ర్థ‌న్ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఇప్పుడు జ‌నార్థ‌న్ ఏం చేస్తాడా అన్న‌ది అంద‌రి అనుమానం. టీమ్ మాత్రం ‘అది వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే. అస‌లు టైటిల్ ఫిక్స్ చేయ‌లేదు’ అంటోంది. కేవ‌లం జ‌నం నాడి తెలుసుకోవ‌డానికే ఈ ఫీల‌ర్ వ‌దిలారా? లేదంటే నిజంగానే ఈ టైటిల్ తో రిస్క్ చేస్తారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close