ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే.. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదలరాజుల రెడ్డి గెలుపు మౌత్ టాక్ సాధించారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అక్రమాలు అరాచకాలు ఆయన బావమరిది బంగారురెడ్డి నిర్వాకాలతో వ్యాపారులు, ప్రజలు విసుగెత్తిపోయారు. ఇలాంటి సమయంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డి బరిలోకి దిగారు. ఆయనంటే ప్రజల్లో గౌరవం ఉంది. చివరి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.

ప్రొద్దుటూరు బరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, టీడీపీ తరపున కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వరదరాజులరెడ్డి ముఖాముఖి తలపడుతున్నారు. ఒకప్పుడు వరదరాజులరెడ్డి అనుచరుడు రామచల్లు. ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డికి భారీ బలగం ఉంది. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అవినీతి ఆరోపణలు, దౌర్జన్యాలు వంటి రికార్డు లేదు. పెద్దాయనగా గౌరవం పొందుతున్నారు. చివరి ఎన్నిక సెంటిమెంట్ తోనూ పాత ఆప్తులందర్నీ దగ్గరకు తీసుకుంటున్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2.20 లక్షలు ఓటర్లు ఉన్నారు. ప్రొద్దుటూరు అర్బన్‌, రాజుపాలెం మండలాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో పెద్దసంఖ్యలో అర్బన్‌ ఓటర్లు ఉన్నారు. రాజుపాలెం మండలం సహజంగా టీడీపీ ఆధిక్యత కలిగిన ప్రాంతం , అర్బన్‌లో రాచమల్లు అరాచకాలతో వైశ్య వర్గం విసిగిపోయింది. ఈ కారణంగా వైశ్య సామాజికవర్గంలో సానుకూలత ఉండడం టీడీపీకి అడ్వాంటేజ్ గా మారింది. రాచమల్లు ప్రసాదరెడ్డిపథకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. లబ్దిదారులు ఓటేస్తారని అనుకుంటున్నారు.

రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వైసీపీ నేతలతో సరిపడటం లేదు. మేజర్ పంచాయతీల సర్పంచ్‌లతో ఎమ్మెల్యే సున్నం పెట్టుకున్నారు. ఫలితంగా కొంత మంది టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటన సందర్బంగా పలువురు నేతలు టీడీపీలో చేరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వీరిలో ముస్లిములు, క్రిస్టియన్లు ఉన్నారు. మైనార్టీ ఓట్లు గత ఎన్నికల్లో వైసీపీకి పడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ వైపు ఎక్కువ వెళ్తాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

పోటీ నుంచి త‌ప్పుకొన్న కాజ‌ల్‌

అదేంటో... అంద‌రి దృష్టీ ఈనెల 31 మీదే ప‌డింది. ఆ రోజున 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గం గం గ‌ణేశా', 'భ‌జే వాయు వేగం', 'స‌త్య‌భామ‌', 'హ‌రోం హ‌ర‌' సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close