‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా ‘భ‌జే వాయు వేగం’. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే ‘భ‌జే వాయు వేగం’ భ‌లేగా సేఫ్ అయిపోయింది. ఈ సినిమాని ఇదివ‌ర‌కెప్పుడో నెట్ ఫ్లిక్స్‌కు రూ.10 కోట్ల‌కు అమ్మేశారు. శాటిలైట్ హ‌క్కులు జీ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఆ రూపంలో నిర్మాత‌ల‌కు మ‌రో రూ.5 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చాయి. అంటే నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో రూ.15 కోట్లు ముట్టాయ‌న్న‌మాట‌. ఇది నిజంగా మంచి డీల్.

ఈ సినిమాని యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది. యూవీ బ్యాండ్ వాల్యూ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కు బాగా ప్ల‌స్ అయ్యింది. ‘మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి’తో పాటుగా ‘భ‌జే వాయు వేగం’ని ఒకేసారి అమ్మేయ‌డం వ‌ల్ల ప్ల‌స్ అయ్యింది. పెద్ద సంస్థ‌ల ద‌గ్గ‌ర ఉండే వెసులుబాటే అది. అన్ని సినిమాల్నీ క‌లిపి గంప‌గుత్త‌గా అమ్మేస్తారు. దాంతో కొన్ని సినిమాలు విడుద‌ల‌కు ముందే గ‌ట్టెక్కేస్తుంటాయి. ఆ లిస్టులో ‘భ‌జే..’ కూడా చేరిపోయింది. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌లైంది. టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా టీజ‌ర్ మంచి స్పీడుగా సాగిపోయింది. ఒక‌ట్రెండు రోజుల్లో ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ పరాభవం ఆ నేత పసిగట్టేశారా… అందుకే ఈ మౌనమా..?

వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా తమ స్వరం వినిపిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ, తదనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలపై పెదవి విరుస్తున్నారు. కూటమి టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కానీ,ఒకప్పుడ వైసీపీలో నెంబర్...

ఇక రేవంత్ వంతు… స‌చివాల‌యంలో వాస్తు మార్పులు

తెలంగాణ రాజ‌కీయాల్లో నాయ‌కుల కోసం వాస్తు మార్పులు, చేర్పులు అనే వార్త వినిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో సచివాల‌యం, ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఇలా ప్ర‌తి చోట వాస్తులో మార్పులు చేర్పులు...

పాపం వైసీపీ… ఉన్న ఆ ఒక్క ఆశ కూడా పోయే!

ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు వైసీపీకి ఏదీ క‌లిసి రావ‌టం లేదు. ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్న ఆ పార్టీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ త‌గులుతూనే ఉంది. పిన్నెల్లి విష‌యంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ‌కు...

టాలీవుడ్‌ ఆశ‌ల ప‌ల్ల‌కి మోస్తున్న‌ ‘జూన్‌’

ఐపీఎల్, ఎల‌క్ష‌న్ల పుణ్య‌మా అని... వేస‌విలో 'క్లీన్ బౌల్డ్‌' అయిపోయింది టాలీవుడ్. మార్చి, ఏప్రిల్, మేల‌లో ఒక‌టీ అరా విజ‌యాలే ద‌క్కాయి. మే మొత్తం ఒక్క హిట్టు ప‌డ‌లేదు. ఈ ఫ‌లితాలు నిర్మాత‌ల్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close