టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్న నియోజకవర్గం గుంటూరు తూర్పు. అక్కడ నుంచి ఇటీవలి కాలంలో వైసీపీ ముఖ్యనేతలంతా టీడీపీలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, డిప్యూటీ మేయర్ సజీల, ఆమె తండ్రి షౌకత్ సహా పలువురు నేతలు చేరిపోయారు. వీరంతా వైసీపీ కి గట్టిగా పని చేసిన వారే.

సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మారుతుందన్న క్లారిటీ రావడంతో ముందస్తుగానే చాలా మంది కండువాలు కప్పుకుంటున్నారు. ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన తర్వాత.. తమను పార్టీలో చేర్చుకుంటారన్న క్లారిటీ లేకపోవడం… గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల.. తమపైనా క్షేత్ర స్థాయిలో వేధింపులు ఉంటే తట్టుకోలేమన్న భావనతో చాలా మంది ముందుగానే సర్దుకుంటున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో తిరుగుతున్న నేతలు టీడీపీ అభ్యర్థికి టచ్ లోకి వచ్చి.. పార్టీ మారకపోయినా మీ కోసమే పని చేస్తానని హమీలు ఇస్తున్నారు. ఈ చేరికల దెబ్బకు వైసీపీ నేతలు కూడా కొత్త ప్లాన్ వేస్తున్నారు. తమ పార్టీలోనూ చేరికలు ఉన్నాయని చెప్పుకునేందుకు ఇటీవలి వరకూ రోజుకు పది మంది వరకూ జగన్ దగ్గరకు తీసుకెళ్లి కండువా కప్పించేవాళ్లు. వారెవరో చాలా మందికి తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close