కేసీఆర్ “దళిత బంధు”కు రేవంత్ “సబ్ ప్లాన్” కౌంటర్..!?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ తప్ప మరేమీ వినిపించడం లేదు. అటు సీఎంగా.. టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నా… ఇటు విపక్ష నేతలు ధర్నాలు..దీక్షలు చేసినా.. అంతా హుజూరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. అదీ కూడా.. అక్కడి దళిత ఓటర్ల అభిమానాన్ని పొందేందుకు చేయాల్సివననీ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్ఎస్‌కు ఈ విషయంంలో అడ్వాంటేజ్ ఉంది. దానికి తగ్గట్లుగా సీఎం కేసీఆర్.. వారిని కలల్లో విహరింప చేస్తున్నారు. రూ. లక్షలకు లక్షలు అకౌంట్లలో పడబోతున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలకు ఇప్పుడు విరుగుడు ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇతర పార్టీలపై పడింది. ఈటల రాజేందర్ అక్కడి దళిత వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో .. ధీమాగానే ఉన్నారు.

ప్రభుత్వం ఎన్ని ఆశలు పెట్టినా… ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు తీసుకున్నా.. చివరికి అండగా ఉండేది తానే కాబట్టి… తనకు ఓటు వేస్తారని ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే.. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించిన రూ. పది లక్షలు దళితుల అకౌంట్లలో పడితే పరిస్థితి మారొచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా.. దళితుల్ని ఆకట్టుకునేందుకు తనదైన ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం కేసీఆర్ వేసిన.. దళిత బంధు పాచికకు కౌంటర్‌గా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంశాన్ని హైలెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగా రేవంత్రెడ్డి ఇప్పటికే దళిత గిరిజనులతో ఓ సభ నిర్వహించి కేసీఆర్‌పై విమర్శలు చేశారు.

ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలకు ఇంచార్జ్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త దామోదర రాజనర్సింహనే. ఆ విషయలో ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సబ్ ప్లాన్ వల్ల… దళితుల నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా దళిత వర్గాలకే అందుతున్నాయి. దీని వల్ల దళిత వర్గాల్లో దామోదరకు ఆదరణ ఉంటుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. ప్రస్తుతానికి హుజూరాబాద్‌కు దామోదరనే ఇంచార్జ్ గా పెట్టినా… చివరికి పరిస్థితిని బట్టి ఆయననే అభ్యర్థిగా ఖరారు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం… కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై స్పష్టమైన అవగాహన ఉన్న రేవంత్.. ఈ విషయంలో… సరైనసమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close