లేపాక్షికి గుర్తింపు ఎవరి బాధ్యత..!?

తెలంగాణలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం తెలుగువారందర్నీ సంతోషపరిచింది. అయితే.. చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్న… లేపాక్షికి కూడా గుర్తింపు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం మాత్రం చాలా మందిలో వినిపించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కానీ.. ప్రాసెస్‌లో ఉంది. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు యునెస్కో సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కేంద్రంచెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కట్టడాలేవీ ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో లేవు. దీనిపై ఎంపీ టీజీ వెంకటేష్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఆరా తీసింది. అయితే లేపాక్షి క్షేత్రం అప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉందని ఆర్కియాలాజికల్ అధికారులు తెలిపారు. అయితే.. దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరూ విఫలమయ్యారు.

విజయనగర రాజుల వాణిజ్య కేంద్రం, చిత్ర, శిల్పకళా సౌందర్యానికి కాణాచిగా లేపాక్షి పేరు పొందింది. లేపాక్షి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతదేవరాయలు ఆస్థానం కోశాధికారి విరూపణ్ణ, సోదరుడు వీరన్నలు 1522-1538 మధ్య కాలంలో నిర్మించారు. 5 ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ఉన్న కొండపై పునాది లేకుండానే నిర్మించారు. మొత్తం ఏడు ప్రాకారాల్లో నిర్మించగా, ప్రస్తుతం మూడు ప్రాకారాలు మాత్రమే మనకు కనబడతాయి. ఆలయంలోని నాట్యమండపం, లతామండపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మండపం, ఏడుశిరస్సుల నాగేంద్రుడు, సీతమ్మపాదం, ఎటుచూసినా మనవైపునకే చూసే శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యమున్న ఇతిహాసాలు నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా.. ఒక్కో స్తంభం ఒక్కో చరిత్రను ప్రస్పుటించేలా శిల్పులు చెక్కారు. వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం ఆసియాలోనే అతి పెద్ద చిత్రంగా ప్రఖ్యాతి చెందింది. లేపాక్షిలోని ఏకశిలా రాతి నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందింది. వేలాడే స్తంభం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రామప్ప ఆలయానికి తీసిపోని రీతిలో నిర్మాణ వైభవం ఉండటంతో.. యునెస్కో గుర్తింపు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికీ తాత్కలిక జాబితాలో ఉన్నందున…శాశ్వత గుర్తింపు కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close