బండి సంజయ్‌పై దూకుడు.. మైనంపల్లికి టీఆర్ఎస్‌లో సపోర్ట్..!?

జెండా పండుగ నిర్వహించుకునే విషయంలో బీజేపీ కార్పొరేటర్, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఏర్పడిన వివాదం.. చినికి చినికి మాటల గాలివానగా మారి.. తిట్ల సునామీగా మారుతోంది. ఈ వివాదంలో ముందుగా గాయపడిన తమ కార్పొరేటర్‌ను పరామర్శించడానికి వచ్చిన బండి సంజయ్.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై విమర్శలు చేశారు. మైనంపల్లి కబ్జాలన్నీ బయటకు తిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదన్నారు. ఆ తర్వాత మైనంపల్లి మరింత దురుసుగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలతో దూషణలకు దిగారు.

మైనంపల్లి, బండి సంజయ్ పరస్పర దూషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాయలేనంత దారుణంగా ఒకరినొకరు తిట్టుకోవడంతో రాజకీయవర్గాలు అవాక్కయ్యాయి. అయితే ఈ వివాదం ఇంతటితో ముగియలేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా మైనంపల్లి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్మిషన్ ఇస్తే బండి సంజయ్ బండారం అంతా బయట పెడతానని ప్రకటించారు. బట్టిలిప్పి అందరి ముందు నిలబెడతానని హెచ్చరించారు. బండి సంజయ్ రాసలీలల టేపులున్నాయని త్వరలోనే అందరి ముందు రిలీజ్ చేస్తానని హెచ్చరించారు. హాఫీజ్ పేటలో భూముల సెటిల్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. ఇక బండి సంజయ్‌కు మద్దతుగా బీజేపీ శ్రేణుల పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. పలువురు నేతలు మైనంపల్లిపై విరుచుకుపడుతున్నారు.

మైనంపల్లి దూషణలు టీఆర్ఎస్ నేతల్ని సంతోష పరుస్తున్నాయి. గతంలో బండి సంజయ్ చాలా దూకుడుగా మాట్లాడేవారు. కేసీఆర్‌పై విమర్శలు చేసేవారు. అయితే టీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోయారు. చాలా సార్లు ఇక సహించబోమని హెచ్చరికలు చేశారు కానీ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను అదే భాషలో హెచ్చరిస్తే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురవుతాయోనని ఆలోచించారు. కానీ వారి కోరినను ఎమ్మెల్యే మైనంపల్లి తీరుస్తున్నారు. దీంతో మైనంపల్లికి టీఆర్ఎస్ పై స్థాయి నేతల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. ఈకారణంగా ఆయన ఒకటికి రెండు అంటూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close