డియ‌ర్ మేఘ‌.. అవార్డులు ఖాయ‌మ‌ట‌!

క‌థానాయిక పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న క‌థ‌లు ఎప్పుడోగానీ పుట్ట‌వు. అలాంటి క‌థ‌, పాత్ర దొరికితే… క‌థానాయిక‌ల‌కు అదృష్ట‌మే అనుకోవాలి. ఆ అదృష్టం మేఘా ఆకాష్ కి కాస్త తొంద‌ర‌గానే వ‌రించింది. `లై`తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది మేఘా. ఇప్పుడు `డియ‌ర్ మేఘ‌`గా రాబోతోంది. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇది ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌. అయితే.. క‌థానాయిక పాత్రే ఈ క‌థ‌కు కీల‌కం. ఆ పాత్ర‌లో మేఘా ఆకాష్ న‌ట‌న‌.. ఓ రేంజ్‌లో సాగింద‌ని ట్రైల‌ర్లు చూస్తేనే అర్థ‌మైపోతోంది. ఈ క‌థ‌కు ఆత్మ‌, ప్రాణం.. మేఘ పాత్రే. అందుకే.. ఈ సినిమాపై మేఘా చాలా ఆశ‌లు పెంచుకుంది. “ఇంత త్వ‌ర‌గా ఇంత గొప్ప పాత్ర నాకు దొరుకుతుంద‌ని అనుకోలేదు. ఇలాంటి సినిమా నా చేతికి రావ‌డం నా అదృష్టం. ట్రైల‌ర్ చూసిన‌వాళ్లంతా.. నీకు అవార్డులు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే అంత‌కంటే అవార్డు మ‌రోక‌టి ఉండ‌దు“ అని అప్పుడే మురిసిపోతోంది మేఘ‌. అదిత్ అరుణ్‌, అర్జున్ సోమ‌యాజుల కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా మ‌ల‌యాళ `దియా`ని పోలి ఉంటుంద‌న్న వార్త‌లొస్తున్నాయి. ఆ సినిమాకి ఇది రీమేక్ అని కూడా అంటున్నారు. చిత్ర‌బృంం మాత్రం ఈ విష‌యంలో గోప్యత పాటిస్తోంది. మ‌రి కొద్ది గంట‌లు ఆగితే ఇది `దియా`కి రీమేకో.. కాదో తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close