ప‌వ‌న్‌కి మ‌రో ప‌ది పెంచిన మైత్రీ

ఫ్లాపుల్లో ఉన్నా – చెక్కు చెద‌రని ఇమేజ్ ప‌వ‌న్ సొంతం. సినిమా సినిమాకీ ఆయ‌న పారితోషికం పెర‌గ‌డ‌మే గానీ త‌గ్గ‌డం ఉండ‌దు. తాజాగా వ‌కీల్ సాబ్ కి రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. ఆ సినిమాకి ప‌వ‌న్ ఇచ్చిన కాల్షీట్లు చాలా త‌క్కువ‌. అయినా స‌రే… 50 కోట్లు ఇచ్చాడంటే దిల్ రాజుకి ఈ ప్రాజెక్ట్ పై ఉన్న న‌మ్మ‌క‌మే. వ‌కీల్ సాబ్ – చేసిన బిజినెస్ తో అది నిజ‌మ‌ని నిరూపిత‌మైంది కూడా.

ఇప్పుడు మైత్రీ మూవీస్ లో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈసినిమా కోసం ప‌వ‌న్ కి రూ.60 కోట్ల పారితోషికం ఇస్తున్నార్ట‌. అంటే.. ప‌వ‌న్ పారితోషికాన్ని మైత్రీ మ‌రో ప‌ది కోట్ల‌కు పెంచిన‌ట్టే. కాక‌పోతే… వ‌కీల్ సాబ్ తో పోలిస్తే.. ఈ సినిమాకి ప‌వ‌న్ ఇంకొన్ని ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి వ‌స్తుంది. ప‌వ‌న్ మాత్రం ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని హ‌రీష్ కి హుకూం జారీ చేశాడ‌ట‌. ఎందుకంటే ప‌వన్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటినీ పూర్తి చేయాలి క‌దా. హ‌రీష్ మామూలుగానే మ‌హా స్పీడు. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్తయిపోయింది కూడా. ప‌వ‌న్ అండ‌దండ‌లుంటే ఈ సినిమానీ చ‌క‌చ‌క అవ్వ‌గొట్టేస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close