తెలంగాణ డబ్బులివ్వాలని కోర్టుకెక్కిన ఏపీ ప్రభుత్వం !

తెలగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ. ఆరు వేల కోట్లపైగా బకాయిలు రావాలని తక్షణం ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని అందులో పేర్కొన్నారు. తమ విద్యుత సంస్థలపై రుణభారం పెరిగిపోయిందని అప్పులు చేయడం సాధ్యపడటం లేదని.. ఇప్పుడు తెలంగాణ బకాయిలు ఇవ్వకపోతే తీవ్రంగా ఇబ్బంది పడతామని హైకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.

అదనంగా కరెంట్ తీసుకుని ఒక్క రూపాయి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటున్న కారణంగా.. విభజన చట్టంలో 57 శాతం కరెంట్ ను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేవలం 43 శాతం కేటాయించారు. అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బులు చెల్లించాలి. మూడున్నరేళ్ల పాటు కరెంట తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి.. అడిగి చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్‌ సరఫరాను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. అయినప్పటికీ కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది.

ఎన్సీఎల్టీలో గత ప్రభుత్వం వేసిన కేసును ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం !

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిల గురించి తెలంగాణ ప్రభుత్వం ఏమీ చెప్పనప్పటికీ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది. రెండున్నరేళ్ల పాటు ఒక్క రూపాయి చెల్లించమని అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ బకాయిలు గుర్తు వచ్చాయేమో కానీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్ ను ఎందుకు ఉపసంహరించుకున్నారని అడుగుతారన్న ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించడానికే ఉపసంహరించుకున్నామని చెబుతున్నారు. అయితే అక్కడ ఉపసంహరణకు ఇక్కడ పిటిషన్ వేయడానికి మధ్య రెండేళ్లు ఏం చేశారనేది తేలాల్సి ఉంది.

ఏపీనే ఇవ్వాలంటూ వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం !

మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని అంటోంది. ఏపీ నుంచే తమకు ఐదు వేల వరకూ కోట్లు ఇవ్వాల్సి ఉందని.. తెలంగాణ ట్రాన్స్‌కో‌ , జెన్‌కో సీఏండీ ప్రభాకర్ రావు మీడియాకు తెలిపారు. అన్నీ లెక్కలు చూసుకుందామని చాలా సార్లు ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖలు రాశామని అయినా వారి నుంచి స్పందన లేదని తెలంగాణ వాదిస్తోంది. మధ్యమధ్యలో జగన్‌కు చెందిన సాక్షి మీడియా పలు మార్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అదే వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close