ఉద్యోగిని బలి చేసి తప్పించుకుంటున్న సాక్షి యాజమాన్యం !

సీబీఐ కోర్టు తీర్పును ముందుగానే ప్రకటించి కలకలం రేపిన సాక్షి మీడియా యజమాన్యం చివరికి అది ఉద్యోగి చేసిన తప్పుగా పేర్కొని.. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పి సీబీఐ కోర్టును సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని.. కేవలం ఉద్యోగి చేసిన తప్పేనని చెప్పుకొచ్చారు. సాక్షి మీడియాకు విస్తృతమైన నెట్ వర్క్ ఉందని… వచ్చే వార్తలను ధృవీకరించుకుని పబ్లిష్ చేయాల్సి ఉందన్నారు. కానీ ఆ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగి చూసుకోకుండా ప్రచురించడం వల్ల సమస్య తలెత్తిందన్నారు.

అందుకే అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడని.. తప్పిదంగా భావించి పిటిషన్‌ను కొట్టి వేయాలని సాక్షి యాజమాన్యం కోర్టులో వాదించింది. అయితే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో అసలు సమాచారం ఎలా వచ్చిందో విచారణ జరిపించాలని కోరారు. కేవలం కోర్టుపై ఓ రకమైన తప్పుడు అభిప్రాయం కల్పించే దిశగానే సాక్షి మీడియా ఇలాంటి ప్రచారం చేస్తోందని అంటున్నారు. విచారణకు సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళితో పాటు సీఈవో కూడా హాజరవుతున్నారు.

పూర్తిగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందున చర్యలు తీసుకోవాల్సిందేనని రఘురామ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కావడం.. ఉద్యోగిపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నాన్ని సాక్షి యజామాన్యం చేయడంతో కోర్టు ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి పలువురిలో ఏర్పడుతోంది. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్న వారే సోషల్ మీడియాలో ఆ తీర్పు పెట్టాలని చెప్పారని..అందుకే ఆ ఉద్యోగి పెట్టారని ఇప్పుడు ఆ ఉద్యోగినే బలి చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం సాక్షి కాంపౌండ్‌లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close