అటు బాల‌య్య..ఇటు చిరు.. త్రిష ఓటు ఎవ‌రికి?

చాలాకాలం త‌ర‌వాత త్రిష పేరు మ‌ళ్లీ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఒక‌టి కాదు.. ఏకంగా రెండు పెద్ద ప్రాజెక్టుల్లో త్రిష పేరు చ‌ర్చ‌కు వ‌చ్చింది. చిరంజీవి – మెహర్ ర‌మేష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. `భోళా శంక‌ర్‌` అనే పేరు పెట్టారు. చిరు చెల్లెమ్మ‌గా.. కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇప్పుడు చిరు ప‌క్క‌న క‌థానాయిక‌నే ఖ‌రారు చేయాలి. ఆ ఛాన్స్ త్రిష‌కే ఎక్కువ ఉంద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమా కోసం త్రిష‌ని సంప్ర‌దిస్తున్నార్ట‌. `స్టాలిన్‌`లో చిరు ప‌క్క‌న త్రిష న‌టించింది. అయితే.. ఆ కాంబో కాస్త ఇబ్బందిగా క‌నిపించింది. అప్ప‌ట్లో చిరు బాగా లావుగా ఉండ‌డంతో.. ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ సెట్ అవ్వ‌లేదు. `ఆచార్య‌`లో తొలుత త్రిష‌నే అనుకున్నారు. కానీ చివ‌రి క్ష‌ణంలో త్రిష డ్రాప్ అయి కాజ‌ల్ వ‌చ్చి చేరింది. ఈసారి మాత్రం… త్రిష దాదాపు ఖాయం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు బాల‌కృష్ణ సినిమాలోనూ క‌థానాయిక‌గా త్రిష పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. వ‌చ్చే నెల‌లో ప్రారంభిస్తారు. క‌థానాయిక‌గా త్రిష పేరు అనుకుంటున్నారు. `రూల‌ర్‌`లో బాల‌య్య‌తో త్రిష జోడీ క‌ట్టింది. ఆ సినిమా ఫ్లాప్‌. అయినా స‌రే, త్రిష‌ని మ‌రోసారి రంగంలోకి దింపాల‌ని ఫిక్స‌య్యార్ట‌. అయితే త్రిష నుంచి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సివుంది. త‌మిళంలో త్రిష చేస్తున్న సినిమాలేం పెద్ద‌గా లేవు. త‌ను కూడా పూర్వ వైభ‌వం కోసం ఎదురు చూస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఏది ఒప్పుకున్నా- త్రిష ఇంకొన్నాళ్లు టాలీవుడ్ కి ట‌చ్ లో ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close