దర్శనాల కోసమే టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులా !?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో 50 మంది ఉన్నారు. వీరికి స్థానిక కోటాలో ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో మరో ఇద్దరు అదనం. పాలక మండలి నియామకం అంశంపై కొద్ది రోజులుగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. టీటీడీ పదవుల ఆశ చూపి ఇతర పనులు చేయించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటి అవసరం జగన్‌కు లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేక అధికారాలు ఉండవని శ్రీవారి సేవ కోసమే వారికి పదవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

ప్రత్యేక ఆహ్వానితులకు దర్శనాలు మాత్రమే టీటీడీ సభ్యుడి హోదాలో దక్కుతాయని … పాలక మండలిలో ఓటింగ్ హక్కు ఉండదని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ 12 మందితో టీటీడీ పాలక మండలి ఉంది. తర్వాత టీడీపీ హయాంలో ఈ సంఖ్యను 15కు పెంచారు. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు చాన్సిచ్చారు. వైసీపి ప్రభుత్వం పాలక మండలి సంఖ్యను 25కి పెంచుతూ..11 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు కల్పించింది. ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50కి చేశారు.

టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అంటే ఓ క్రేజ్ ఉండేది. ఎక్కువ మంది దర్శనాల కోసమే ఈ పదవుల కోసం లాబీయింగ్ చేస్తారు. దర్శన టిక్కెట్లను టిటీటీ సభ్యుల పేరుతో తీసుకుని అనేక మంది బ్లాక్‌లో అమ్ముతూ ఉంటారు.అధికారింగా రోజుకు రెండు వందల టిక్కెట్లు ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ ఉంటారు.ఇప్పుడు ఉన్న దాదాపుగా 80మంది సభ్యులు ఒక్కొక్కరికి రెండు వందల టిక్కెట్లుకేటాయిస్తే భక్తులు ఇక వారి అనుచరులు.. వారు చెప్పిన వారికిమాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందనే ఆరోపణలుఉన్నాయి.

రాజకీయ ఒత్తిళ్లు, ఇతర అవసరాల కోసం టీటీడీ బోర్డు సభ్యుల పదవుల్ని ప్రకటిస్తే రేపు వారు ఏదైనా తప్పుడు పని చేస్తే పోయేది ప్రభుత్వం పరువే. భక్తుల సెంటిమెంట్‌లతో ఆడుకుంటే తర్వాత వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

కవిత బెయిల్ రిజెక్ట్ – ఇప్పుడల్లా కష్టమే !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా...

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close