పోలీసు వారి లెక్క : నేర స్వభావ కేసులు తగ్గాయి !

ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు 63 శాతం పెరిగిపోయాయని జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు విడుదల చేసింది. ఈ రికార్డులన్నీ పక్కాగా ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం తమదైన లెక్కలు విడుదల చేశారు. ఏపీలో పదిహేను శాతం కేసులు తగ్గాయట. ఎందుకంటే కాగ్నిజబుల్ నేరాలను మాత్రమే పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. అంటే నేర స్వభావం ఉన్న కేసులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటే ఏపీలో కేసులు తగ్గాయని చెబుతున్నారు. నేరస్వభావం లేనివి అంటే ఎస్‌ఈబీ కేసులు, కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులు అని పోలీసులు చెబుతున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టామని అవేమీ లెక్కలోకి రావని అంటున్నారు. వాటిని తీసేస్తే తమ పనితీరు చాలా మెరుగ్గా ఉందని కేసులను కట్టడి చేశామని చెప్పుకొచ్చారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా లాక్‌డౌన్, కర్ఫ్యూలను అమలు చేసేందుకు పోలీసులు నమోదు చేసిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉద్దేశించిన కేసులు కూడా అధికమేనని అవి శాంతిభద్రతలకు సంబంధించినవి కావని పోలీసులు చెప్పుకొచ్చారు. 2019లో రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ల కింద 1,19,229 కేసులు నమోదయ్యాయి. కాగా, 2020లో 1,88,997 కేసులు నమోదు చేశారు. ఇంత స్పష్టంగా పెరుగుదల కనిపిస్తున్నా.. వాటిలో ఎనభై వేల కేసులు కరోనా కట్టడి కేసులని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వాటికి కూడా ఎందుకు కేసులు పెడుతున్నారంటే చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికేనని చెబుతున్నారు.

రాజకీయ కారణలతో పెట్టే కేసులు ఎక్కువ కావడంతోనే ఈ సమస్య వచ్చిందని.. ఇష్టం లేని వారు ఎవరు రోడ్డుపైకి వచ్చినా కరోనా కట్టడి పేరుతో కేసులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే కేసులువిపరీతంగా పెరిగినా తగ్గాయని పోలీసులు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం.. జాతీయ నేర గణాంక రికార్డు కళ్ల ముందు ఉన్నా.. నమోదైన కేసులన్నీ నేర స్వభావం ఉన్నవి కావని చెప్పడం పోలీసులు ఉన్న పరిస్థితికి నిదర్శనంగా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేర స్వభావం లేనప్పుడు కేసులు ఎందుకు పెట్టారో కూడా వివరించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close