రాజధాని జాతి సామర్థ్య చిహ్నమన్న మోడీ .. ఆంధ్రులకు మాత్రం కాదు !

రాజధాని అంటే ఏంటి ? . రాజధాని అంటే జాతి సామర్థ్య చిహ్నం. ఎంత గొప్పగా ఉంటే మన జాతి అంత గొప్పగా ఉందని ప్రపంచం భావిస్తుంది. అందుకే ఢిల్లీని మరింత సుందరంగా మారుస్తున్నారు నరేంద్రమోడీ. అక్కడ సెంట్రల్ విస్టా పేరుతో రూ. పాతిక వేల కోట్లు పెట్టి కొత్తగా కడుతున్న కాంప్లెక్స్‌ల గురించి ఆయన ఈ మాటలు మాట్లాడారు. ఈ మాటలను ఎవరూ కాదనలేరు. రాజధాని అనేది జాతి సామర్థ్య చిహ్నమే. విభిన్న సంస్కృతులు.. రాష్ట్రానికి రాష్ట్రానికి స్పష్టమైన తేడా ఉన్న ఇండియాలో అయితే ఆయా రాష్ట్రాలకు రాజధానులు ఆర్థిక సామర్థ్యానికి కూడా చిహ్నాలే.

అందుకే అన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల రాజధానుల్ని వీలైనంత వరకూ తమ సామర్థ్యాన్ని చిహ్నంగా మార్చుకుంటున్నాయి. మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది సహజమే. అందరిలోనూ ఆంధ్రులు కాస్త ఎక్కువే కాబట్టి ఏకంగా మూడు జాతి సామర్థ్య చిహ్నాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఏది అసలైన రాజధానో స్పష్టత లేకపోయినా ఆంధ్రులకు పట్టింపు ఉండదు. జాతి సామర్థ్యం రాజధాని మీదే ఉంటుందని ఆంధ్రులు అసలు అనుకోరు. ఏదైనా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచిపరిపాలిస్తే అదే రాజధానిగా ఫిక్సయిపోతారు. అది పులివెందుల అయినా పర్వాలేదు. దాన్నే జాతి సామర్థ్యాన్ని చిహ్నంగా చూసుకుంటారు.

రాజధాని అనే దానిపై ఇంత స్పష్టమైన అవగాహన ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు అని చెబుతూంటే ఎందుకు సమర్థించారో ఆంధ్రులే అర్థం చేసుకోవాలి. తను స్వయంగా శంకుస్థాపన చేసిన రాజధానిని రాజధాని కాదంటే మంచి చెడూ చెప్పాల్సిన వారే అలాగే చేయమని ప్రోత్సహించారంటే ఎందుకు చేశారో ఆంధ్రులు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారికి జాతి సామర్థ్యం నిరూపితమవుతుంది . లేకపోతే ప్రధానమంత్రి మాటలు వింటూ … గొప్పలు చెప్పుకుంటూ బతకాల్సిందే..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close