ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్ !

మరో ఆరు నెలల తర్వాత అందరూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాలని సీఎం జగన్ కేబినెట్ మంత్రులకు రూట్ మ్యాప్ ఖరారు చేసి చెప్పారు. ఆయన పీకే టీం గురించి కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం పని చేయడానికి వస్తుందని ఆయన మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే మూడేళ్లు పూర్తి కాగానే జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే వైసీపీ పార్టీ నేతల్లోనూ చర్చనీయాంశమయింది. ముఖ్యమంత్రి మదిలో ముందస్తు ఆలోచన ఉందా అన్న చర్చ ప్రారంభమయింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు ముందుగానే జరుగుతాయి. అంటే 2023 ద్వితీయార్థంలోనే జరుగుతాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఆరు నెలలు లేదా ఏడాది ముందుగానే ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఏడాది బడ్జెట్‌లో దళిత బంధు కోసం రూ. ఇరవై వేల కోట్లు కేటాయించి వాటినే మళ్లీ గెలిస్తే పంచుతామని ప్రకటిస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దాని కోసం ఇప్పటికే బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని.. ముందస్తు కోసం వారి సహకారం తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళితే .. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లే ఆలోచన సీఎం జగన్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగడాన్ని ప్రాంతీయ పార్టీలు కోరుకోవు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు కోరుకోవు. అందుకే జగన్ మదిలోనూ ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందని చెబుతున్నారు. ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకోవడంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో క్లారిటీ లేదు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రుల్ని మార్చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల వంద శాతం మంత్రుల్ని మార్చేయాలన్న ఆలోచన చేశారన్న అభిప్రాయం కూడా వినిపించింది. కానీ ఉన్న మంత్రులకే అందరూ మంత్రుల హోదగాలోనే ప్రజల్లోకి వెళ్లాలన్న సందేశాన్ని పంపడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close