అప్పుల లెక్కల లేఖలేనా ? కేంద్రం ఏమైనా తప్పు దిద్దుతుందా ?

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ,కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే పనిగా లేఖలు అందుతున్నాయి. ఓ సారి కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్న అప్పుల వివరాలు చెప్పాలంటారు. మరోసారి అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నిస్తారు. మరోసారి విదేశీ సంస్థల సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల సాయం నిధుల గురించి ప్రశ్నిస్తారు.మరోసారి కేంద్ర పథకాల నిధుల మళ్లింపు గురించి ప్రశ్నిస్తారు. చివరికి కాగ్.. చేసిన చెల్లింపుల్లో రూ. పదకొండు వేల కోట్లు ఎవరికి చెల్లించాలో వివరాలు లేవని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ లేఖ రాస్తోంది. అయితే ఇవన్నీ లేఖలే ఏపీ ప్రభుత్వం వివరణ ఇస్తుదో లేదో తెలియదు.. దానికి కేంద్రం సంతృప్తి చెందుతుందో లేదో కూడా తెలియడం లేదు.

అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రో మరొకరో వెళ్లి అప్పులకు పర్మిషన్ కావాలంటే ఉన్న పళంగా ఇచ్చేస్తోంది కేంద్రం. ఎంత కావాలంటే అంత అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తోంది. సంస్కరణలు అమలు చేశారంటూ మరింత అప్పునకు పర్మిషన్ ఇస్తోంది. ఇప్పటికే ఇచ్చిన రుణ పరిమితి కన్నా రూ. లక్ష కోట్ల అప్పులు ఎక్కువ చేశారన్న ఆరోపణలు ఉన్నా…ఆ మేరకు కేంద్రంవద్ద ఉన్న వివరాలతో లేఖలు పంపుతున్నా.. ఏ మాత్రం వెరపు లేకుండా అప్పులకు పర్మిషన్ ఇస్తూనే ఉన్నారు. కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి అందుతున్న లేఖల వివరాలు చూస్తే ఏపీలో అప్పులు, ఆర్థిక నిర్వహణపై కేంద్రానికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడ తప్పు జరుగుతుందో చాలా స్పష్టంగా తెలుసు. కానీ తెలియనట్లుగా లేఖలతో టైంపాస్ చేస్తోందనేది బహిరంగ రహస్యంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం తమ తప్పేమీ లేనట్లుగా .. అంతా ఏపీనే చేసుకుందన్నట్లుగా కనిపించడానికి చేస్తోంది.కానీ ఏపీ తప్పులు చేయడానికి మాత్రం సహకరిస్తోంది. ఎందుకు ఇలా చేస్తోందో ఆర్థిక నిపుణులకూ అర్థం కావడం లేదు. ఓ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ దారుణంగా దెబ్బతిని పోయే ప్రమాదం కనిపిస్తున్నా.. ఎందుకు సైలెంట్‌గా ఉటున్నారో… అంచనా వేలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వం తప్పులు చేస్తోందని తెలిసినప్పుడు ఎందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా అప్పులకు ఇంకా ఇంకా ఎందుకు ప్రోత్సాహం అవకాశం ఇస్తున్నారో స్పష్టత లేదు. అధికారులు తాము గుర్తించిన తప్పుల మేరకు నోటీసులు జారీ చేస్తున్నారు… రాజకీయ పరంగా వాటిని పై స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో లైట్ తీసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close