తాలిబన్లతో బెజవాడ గ్యాంగ్ డ్రగ్స్ బిజినెస్!

ఆప్ఘనిస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీ టాల్కమ్ పౌడర్ దిగుమతి చేసుకుంది. ఈ కంటెయిన్ వచ్చిన తర్వాత అధికారులు పరిశీలన జరిపితే అది టాల్కమ్ పౌడర్ కాదు.. హెరాయిన్ అని తేలింది. ఆ హెరాయిన్ విలువ రూ. వంద..రెండు వందల కోట్లు కాదు. ఏకంగా రూ. తొమ్మిది వేల కోట్లు. ఈ హెరాయిన్ పరిమాణాన్ని చూసి డీఆర్ఐ అధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఆషీ ట్రేడింగ్ పేరుతో విజయవాడ కంపెనీ ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటోంది.

ఊరూపేరూ లేనికంపెనీ ఆషి ట్రేడింగ్ అని తేలింది. అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి వ్యాపారాలు చేయని సంస్థ. గత ఏడాదే దాన్ని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బినామీలు.. తప్పుడు పేర్లు పెట్టి కంపెనీని పెట్టిన దుండగులు ఈ డ్రగ్స్‌ను విజయవాడ కేంద్రంగా దిగుమతి చేసుకుని వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడను ఎందుకు సేఫ్‌జోన్‌గా ఎంచుకున్నారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఆప్ఘనిస్థాన్‌లో డ్రగ్స్ బిజినెస్ మొత్తం తాలిబన్ల చేతుల్లోనే ఉంటుంది. వారితోనే విజయవాడకు చెందిన గ్యాంగ్ డీల్స్ చేసుకుని ఇలా వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను దేశంలోకి దిగుమతి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాంటే ఇప్పటి వరకూ ఎంత ఇలా దేశంలోకి డ్రగ్స్‌ను డంప్ చేసి ఉంటారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆ విజయవాడ గ్యాంగ్‌ను పట్టుకుంటేనే కానీ ఈ రహస్యం బయటకు రాదు. నేరుగా తాలిబన్లతోనే డీల్ చేస్తున్నారంటే అతి సామాన్య మైన విషయం కాదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రొమాంటిక్ రివ్యూ ఇచ్చిన పూరి

ఆకాష్‌ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్‌ పాడూరి తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం వరంగలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా...

నెక్ట్స్ ఎలక్షన్ పోరాటానికి టీడీపీకి “ఊహించని కిక్ స్టార్ట్” !

ఎన్నికల పోరాటానికి రాజకీయ పార్టీలు ముహుర్తం పెట్టుకుని సభలో..సమావేశాలో పెట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటాయి. అయితే వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పోరాటానికి వైసీపీనే ముహుర్తం పెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు...

వైఎస్సార్ కడప లాగే..దామోదరం సంజీవయ్య కర్నూలు.. పవన్ డిమాండ్ !

దామోదరం సంజీవయ్యను తమ పార్టీ ఐకాన్‌గా ముందుకు తీసుకెళ్లేందుకు దళితు వర్గాల్లో ప్రత్యేకమైన ఆదరణ పొందేందుకు పవన్ కల్యాణ్ సీరియస్‌గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటిని స్మారకంగా మార్చేందుకు రూ. కోటి...

చంద్రబాబు కుప్పం వస్తే బాంబులేస్తాం.. వైసీపీ నేతల హెచ్చరిక !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబును రెండు రోజులు తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో అన్నితిట్లు తిడుతున్నారు. పట్టాభి సీఎంను అసభ్యంగా ఓ పదంతో తిట్టారని.. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ...

HOT NEWS

[X] Close
[X] Close