డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాల్లేవు : తెలంగాణ ఎక్సైజ్ శాఖ

తెలుగు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు అందర్నీ ఎక్సైజ్ శాఖ ఒడ్డున పడేసింది. ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవన్నారు. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. రెండు రోజుల కిందటే పూరి, తరుణ్ ల వద్ద సేకరించిన శాంపిల్స్‌లో ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు.

కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఈడీ కేసును దర్యాప్తు చేస్తోంది. కెల్విన్‌తో ఆర్థిక వ్యవహారాలను నడిపిన సినీ ప్రముఖులను పిలిచి ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో కెల్విన్ అప్రూవర్‌గా మారారన్న ప్రచారం కూడాజరిగింది. కెల్విన్‌ను.. సినీ ప్రముఖులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అసలు సినీ ప్రముఖులతో ‌డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం లేదని తేల్చి చెప్పడంతో వారికి ఊరట లభించనుంది.

అదే సమయంలో తెలంగాణలోనూ డ్రగ్స్ కేసు వ్యవహారం రాజకీయ అంశమయింది. రేవంత్ రెడ్డి , కేటీఆర్ మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్సైజ్ శాఖ గతంలో జరిగిన విచారణపై రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివరాలను ఎక్సైజ్ శాఖ ఇవ్వడం లేదని చాలా మంది సినీ ప్రముఖుల పేర్లను తప్పించారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే అసలు ఎలాంటి సెలబ్రిటీలపైనా బలమైన ఆధారాల్లేవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేయడం ఇప్పుడు కీలకం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘హ‌రోం హ‌ర‌’.. కాస్త ఆల‌స్యంగా!

ఈనెల 31న రావాల్సిన సినిమా 'హ‌రోం హ‌ర‌'. అయితే అదే రోజున నాలుగైదు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అందుకే 'హ‌రోం హ‌ర‌' ఈ పోటీ నుంచి త‌ప్పుకొంది. జూన్ 14న వ‌స్తున్న‌ట్టు చిత్ర‌బృందం...

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close