టీవీ ఛాన‌ళ్ల‌ని క‌డిగి పారేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదం వార్త చాలా టీవీ ఛాన‌ళ్ల‌కు కొన్ని రోజుల పాటు ఫుటేజీని అందించింది. జ‌రిగిన ప్ర‌మాదం కంటే – అన‌వ‌స‌ర‌మైన హంగామాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి టీవీ ఛాన‌ళ్లు. బైకు స్పీడు ద‌గ్గ‌ర్నుంచి బైకు మోడ‌ల్‌, దాని రేట్‌.. ఇలా న్యూస్ ప‌క్క దారి ప‌ట్టి, మార్కెటింగ్ వ్య‌వ‌హారంలా మారిపోయింది. ఓ టీవీ ఛాన‌ల్ అయితే.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఇంటికెళ్లి మ‌రీ… `ఇక్క‌డి నుంచే సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న బైక్ ని బ‌య‌ట‌కు తీశాడు` అంటూ… ఎవ్వ‌రికీ అక్క‌ర్లేని హంగామా చేసింది. అక్క‌డితో ఆగ‌లేదు. ఓవ‌ర్ స్పీడు, నిర్ల‌క్ష్యం అంటూ వార్త‌లు దంచికొట్టింది. ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో బాగా ట్రోల్ కూడా అయ్యాయి.

ఇప్పుడు వీట‌న్నింటిపైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన స్టైల్ లో కౌంట‌ర్ వేశారు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ వేడుక‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథిగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా టీవీ ఛాన‌ళ్ల వైఖ‌రిపై గ‌ళం విప్పారు. సాయిధ‌ర‌మ్ తేజ్ పై క‌నిక‌రం చూపించాల్సిన స‌మ‌యంలో – ఓవ‌ర్ స్పీడు, నిర్ల‌క్ష్యం అంటూ వార్త‌లు దంచికొట్టిన విష‌యం త‌న వ‌ర‌కూ వ‌చ్చింద‌ని, అవ‌న్నీ త‌న‌ని బాధించాయ‌ని పేర్కొన్నారు. `త‌ప్పులు జ‌రుగుతాయి.. మీ ఇళ్ల‌ల్లో జ‌ర‌గ‌వా..` అంటూ నిల‌దీశారు. దీని కంటే ముఖ్య‌మైన వార్త‌లు కొన్ని ఉన్నాయ‌ని, అవి మ‌రింత స్పైసీగా కూడా ఉంటాయ‌ని, వీలైతే వాటిపై దృష్టి పెట్టాల‌ని ఛాన‌ళ్ల‌కు కౌంట‌ర్లు వేశారు. వివేకానంద హ‌త్య గురించి, ఆరేళ్ల బాలిక‌పై జ‌రిగిన అన్యాయం గురించీ, వ్య‌భిచారాన్ని ప్రోత్స‌హించిన వైకాపా నాయ‌కుల గురించీ, కోడి క‌త్తి గురించి వార్త‌లు ప్ర‌సారం చేస్తే ఇంకా స్పైసీగా ఉంటుంద‌ని, వాటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగం ఉంద‌ని, ఈ దిశ‌గా ఆలోచిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close