ప‌వ‌న్ స్పీచ్‌… అద‌ర‌గొట్టేశాడంతే!

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా వేదిక‌ల‌పై పెద్ద‌గా మాట్లాడ‌డు. కాక‌పోతే… పొలిటిక‌ల్ లీడ‌ర్ అయ్యాక‌… మాట్లాడ‌డం అల‌వాటైంది. సినీ వేదిక‌ల్ని సైతం త‌న పొలిటిక‌ల్ స్పీచుల‌కు వార‌ధిగా వాడేస్తున్నాడు. `రిప‌బ్లిక్‌` వేడుక‌లోనూ అదే జ‌రిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నాడ‌న‌గానే… అంద‌రి దృష్టీ… అటువైపుకు వెళ్లింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ సంక్షోభంలో ఉంది. ఏపీ ప్ర‌భుత్వ‌విధానాలు, అడ్డ‌గోలు నిర్ణ‌యాలు… చిత్ర‌సీమ‌కు శాపంగా మారాయి. వీటిపై ప‌వ‌న్ మాట్లాడ‌తాడ‌ని అంతా ఆశించారు. అదే జ‌రిగింది. రిప‌బ్లిక్ వేదిక‌పై నుంచి.. ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. వైకాపా నాయ‌కుల‌పై, మంత్రుల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. కొన్ని చెళులుకు టాలీవుడ్ స్టార్ల‌పైనా ప‌డ్డాయి. దాదాపు 45 నిమిషాల పాటు సాగింది ప‌వ‌న్ స్పీచ్‌. ఈమ‌ధ్య‌కాలంలో ప‌వ‌న్ ఇచ్చిన బెస్ట్ స్పీచ్ ఇది.

సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ పై మీడియా చేసిన అతి ద‌గ్గ‌ర్నుంచి ప‌వ‌న్ ప్ర‌వాహం మొద‌లైంది. ఆ త‌ర‌వాత హీరోలు కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్నార‌న్న విష‌యంపైకి టాపిక్ మ‌ళ్లింది. ఒళ్లు హూనం చేసుకుంటే, వెన్నెముక‌లు విర‌గ్గొట్టుకుంటే డ‌బ్బులు ఇస్తున్నార‌ని, ఉత్తి పుణ్యానికి ఇవ్వ‌డం లేద‌ని, అది క‌ష్టార్జిత‌మ‌ని దోచుకోలేద‌ని – హీరోల త‌ర‌పున నిల‌బ‌డి మాట్లాడ‌డం ముచ్చ‌ట గొలిపింది. ప్ర‌భాస్ కండ‌ల గురించి, ఎన్టీఆర్ డాన్సుల గురించి ప‌వ‌న్ మాట్లాడ‌డం, ఆ హీరోల అభిమానుల‌కూ న‌చ్చే విష‌య‌మే.

టికెట్ రేట్ల వ్య‌వ‌హారంలో సినీ పెద్ద‌లు ప్రాధేయ ప‌డ‌డం ప‌వ‌న్ కి న‌చ్చ‌లేదు. ఇదే విష‌య‌మై కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. అన్న‌య్య చిరంజీవి మెత‌క వ్య‌వ‌హారాన్నీ వ‌ద‌ల్లేదు. `అలా ప్రాధేయ‌ప‌డొద్ద‌ని అన్న‌య్య‌కు చెప్పండి` అంటూ సున్నితంగానే చుర‌క అంటించారు. `మా వంశం అని గొప్ప‌లు చెప్పుకుంటారు క‌దా.. మీరేం మాట్లాడ‌రా` అంటూ ప‌రోక్షంగా బాల‌య్య‌ని ఉద్దేశించి కామెంట్ చేశాడు. మోహ‌న్ బాబునీ వ‌ద‌ల్లేదు. `మా బంధువులు అని.. సీఎమ్ గురించి చెప్తారు క‌దా, మీరైనా అడ‌గండి` అని ఆయ‌నకూ హిత‌బోధ చేశాడు. `నాకేంటి సంబంధం అనుకుంటే మీ విద్యానికేత‌న్ కీ ఇదే ప‌రిస్థితి ఎదురుకావొచ్చు` అని హెచ్చ‌రించాడు. టికెట్ల రేట్ల విష‌యంలో ప్ర‌భుత్వాల‌న్ని ప్రాధేయ ప‌డొద్ద‌ని, హ‌క్కుల గురించి గ‌ట్టిగా నిల‌దీయాల‌ని అలా నిల‌దీయ‌క‌పోతే `రిప‌బ్లిక్‌` అనే ప‌దానికే అర్థం ఉండ‌ద‌ని స్పీచు దంచి కొట్టాడు ప‌వ‌న్‌. `నాపై కోపం ఉంటే నా సినిమాలు ఆపండి. ప‌రిశ్ర‌మ‌ని ఇబ్బంది పెట్టొద్దు` అంటూనే `నా సినిమాల్ని ఆప‌గ‌ల‌రా?` అంటూ స‌వాల్ కూడా విసిరాడు.

45 నిమిషాల ప‌వ‌న్ స్పీచ్ చాలా యాంగిల్స్ లో సాగింది. చాలా విష‌యాల్ని నిర్మొహ‌మాటంగా, ధైర్యంగా మాట్లాడ‌గ‌లిగాడు. క‌నీసం ఒక‌రిద్ద‌రు హీరోలైనా ఈ స్థాయిలో మాట్లాడితే నిజంగా ప్ర‌భుత్వాన్ని క‌డిగిపారేసిన‌ట్టు అవుతుంది. కానీ ప‌వ‌న్‌కి ఉన్న ధైర్యం మిగిలిన వాళ్ల‌కు ఉంటుందా? అనుమాన‌మే. ప‌వ‌న్ స్పీచు క‌చ్చితంగా టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ సెగ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికీ తాకితే, ఈ వేడిని అర్థం చేసుకుంటే తెలుగు చిత్ర‌సీమ‌కు మంచే జ‌రుగుతుంది. ఇదే అదును అనుకుని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఏది జ‌రిగినా ఎదుర్కోవ‌డానికి ప‌వ‌న్ సిద్ధంగానే ఉన్నాడు. అయినా ప‌వ‌న్ త‌న వైఖ‌రి కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టే చెప్పాడు. `తెగెవ‌ర‌కూ లాగొద్దు` అన్నాడు. జ‌ల్సాలోని `కుర్రాడు కామెడీగా చంపేస్తాడు` అని ఓర‌కంగా వార్నింగ్ ఇచ్చాడు. మ‌రి జ‌గ‌న్ ప్ర‌భుత్వం రియాక్ష‌న్ ఏమిటో చూడాలి.

రిపబ్లిక్ లో పవన్ స్పీచ్: మీడియా పై అద్దిరి పోయే పంచ్ లు

రిపబ్లిక్ డే సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఈ స్పీచ్ లో మీడియా పై పవన్ కళ్యాణ్ సుతి మెత్తగా వేసిన విసుర్లు, అదిరిపోయే పంచ్ లు అభిమానులు, ప్రేక్షకుల నుండి భారీ స్పందన ను రాబట్టాయి. వివరాల్లోకి వెళితే..

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన కారణంగా ఈ ఫంక్షన్ కు రాలేక పోతున్నందుకు హీరో లేని వెలితి తీర్చడానికి తాను ఈ రోజు ఈ ఫంక్షన్ కి వచ్చాను అని ప్రారంభించిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సమయంలో ఆ వార్తని ప్రజల కు తెలియ జేసిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అదే సమయంలో, అసందర్భ కథనాలు వేసిన కొన్ని మీడియా సంస్థల పై సుతి మెత్తని విమర్శలు చేశారు. 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళుతూ తేజు ప్రమాదానికి గురయ్యాడు అంటూ కథనాలు వేయడం పట్ల పవన్ కళ్యాణ్ ఆవేదన తో కూడిన వ్యంగ్యంతో స్పందించారు. మీడియా చేయవలసిన కథనాలు ఇవి కాదని, మీడియా కథనాలు చేయాలంటే ఎలాంటి వాటి పై కథనాలు చెయ్యాలో తాను చెబుతానని అంటూ – వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యాడు అన్న దాని పై మీడియా కథనాలు చేయవచ్చునని, కోడి కత్తి తో ఒక నాయకుడి పై హత్యా యత్నం జరిగినప్పుడు, అప్పటి గవర్నర్ కూడా దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారని, మరి ఆ కుట్ర ఏమైంది అన్న విషయం పై మీడియా కథనాలు చేయ వచ్చునని, లక్షల ఎకరాల పోడు భూములు పేదలకు ఆధీనం లోకి రాకుండా పోతున్న సమస్య పై మీడియా కథనాలు చేయవచ్చునని పవన్ వ్యాఖ్యానించారు. ఆరేళ్ళ చిన్నారి అమానుషంగా హత్యకు గురైతే, దాన్ని వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లిపోయాడు అంటూ కథనాలు చేశారని పవన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. కొనసాగింపు గా మాట్లాడుతూ, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి, వైసీపీ అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్ లను వదిలి వేసిన వారి గురించి కథనాలు చేయండి అంటూ పరోక్షంగా ముద్రగడ కు, మీడియా కు కలిపి పవన్ చురకలంటించారు. రాయల సీమ లో బలిజ కులస్తుల వెనుకబాటుతనం గురించి, బోయ కులస్తులు రాజ్యాధికారానికి దూరం అయి పోవడం గురించి, ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి కథనాలు చేయాలంటూ మీడియాకు సూచించారు. ఇడుపుల పాయలో డబ్బులు కట్టలు కట్టలు దాచి పెట్టారని కొందరు పోలీసులు కూడా చెబుతున్న రూమర్స్ పై మీడియా కథనాలు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వీటన్నింటినీ వదిలేసి ఇప్పటికీ కోమాలో ఉన్న సాయి ధరమ్ తేజ్ పై కొన్ని వర్గాల మీడియా సంస్థలు అసందర్భ కథనాలు ఇచ్చాయి అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

తాను చెప్పిన ఈ పొలిటికల్ క్రైమ్ ల పై మీడియా కథనాలు చేయదని, ఒకవేళ అలా చేస్తే రాజకీయ నాయకులు ఇళ్లల్లోకి వచ్చి మరీ కొడతారని, అందుకే అటువంటి రాజకీయ నాయకుల జోలికి వెళ్లకుండా, సాఫ్ట్ టార్గెట్ గా ఉన్న చిత్ర పరిశ్రమపై, సినిమా వాళ్ళ పై మీడియా వారు ఇలాంటి కథనాలు చేస్తూ ఉంటారని పవన్ విశ్లేషించారు. దీనికి ముందు, సినీ సమస్యల పై ధైర్యంగా స్పందించిన రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవకట్టా ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు.

సినిమా పరిశ్రమ సమస్యల పై పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాట్లాడుతాడు అని ముందుగానే ఊహించి నప్పటికీ, ఈ స్థాయిలో మీడియా పై అధికార పార్టీ పై, విరుచుకు పడతారని మాత్రం ఎవరు ఊహించలేదు. మొత్తం మీద ఈ స్పీచ్ వల్ల జరిగే పరిణామాలు తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ధైర్యంగా మాట్లాడడం ఆయన అభిమానులనే కాకుండా సినీ పరిశ్రమ ని కూడా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.

ఎన్టీఆర్, ప్రభాస్, రానా పేర్లు ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, నాని కి మద్దతు

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సాయి ధరమ్ తేజ్ రాలేకపోవడం వల్ల ఆ ఫంక్షన్ కి హాజరైన పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో అభిమానులకు మరొక సారి పూనకాలు తెప్పించాడు. తన స్పీచ్ లో ఎన్టీఆర్, ప్రభాస్, రానా పేర్లు ప్రస్తావించడమే కాకుండా నేచురల్ స్టార్ నాని కి మద్దతు గా పవన్ చేసిన వ్యాఖ్యలు స్పీచ్ లో హైలెట్ గా మిగిలాయి. వివరాల్లోకి వెళితే…

అధికార వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సినిమాలపై కక్ష కట్టినట్లు ఇటీవల ప్రవర్తిస్తూ ఉండడం తెలిసిందే. సినిమా వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు అన్నట్లుగా రాజకీయ నాయకులు తమను టార్గెట్ చేయడం పట్ల పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తాము అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించడం లేదని, దొంగ కాంట్రాక్టులు చేసి డబ్బులు వెనక్కేసుకోవడం లేదని అంటూ పరోక్షంగా రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు. తాము సిన్సియర్ గా టాక్స్ కడుతున్నామని, మీలాగా టాక్సులు ఎగ్గొట్టడం లేదని రాజకీయ నాయకులకు చురకలంటించారు.

అయినా తమకేమీ డబ్బులు ఊరికే ఇవ్వరని, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి, కింద పడి మీద పడి ఎముకలు విరగొట్టుకుని తాము సంపాదిస్తున్నా మని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బాహుబలి సినిమా లో ప్రభాస్ లాగా కండలు పెంచితేనో, రానా లాగ కష్టపడి బాడీ బిల్డింగ్ చేస్తేనో, ఎన్టీఆర్ లాగా అత్యద్భుతంగా డాన్స్ చేస్తే నో, రామ్ చరణ్ లాగా గుర్రపు స్వారీ చేస్తేనో తమకు డబ్బులు ఇస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చేశారు.

అదే సమయంలో నేచురల్ స్టార్ నాని కి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొన్నామధ్య టక్ జగదీష్ సినిమా ని నాని థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. దీని పై థియేటర్ యజమానులు అప్పట్లో నాని ని టార్గెట్ చేశారు. రిపబ్లిక్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ దీని పై స్పందిస్తూ నాని కి మద్దతు ప్రకటించారు. థియేటర్ యజమానులు టార్గెట్ చేయాల్సింది నాని ని కాదని, వారు టార్గెట్ చేయాల్సింది థియేటర్ లు తెరవకుండా ఆపేసిన వైఎస్ఆర్ సీపీ నేతలని అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మొత్తం మీద నాని కి పవన్ కళ్యాణ్ మద్దతు పలకడం, ఇతర హీరోల పేర్లు ప్రశంసా పూర్వకంగా ప్రస్తావించడం స్పీచ్ లో హైలెట్ గా నిలిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close