భాగ్యనగరంలో అత్యంత విలువైన వెయ్యి కోట్ల రూపాయల భూకబ్జా వ్యవహారం గుట్టురట్టయిన కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న వైసీపీ నేత బ్రహ్మానాయుడిని అరెస్ట్ చేయడంలో హైదరాబాద్ పోలీసులు అవలంబిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి భారీ భూకుంభకోణం వెలుగుచూసి, చట్టపరంగా అన్ని ఆధారాలు లభించినప్పటికీ ఆయనను ఇంకా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నప్పటికీ, లోపాయికారీగా ముందస్తు బెయిల్ వచ్చే వరకు సమయం ఇస్తున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, ఒక నిందితుడు ఎక్కడున్నా గంటల వ్యవధిలో పట్టుకునే సత్తా సైబర్ క్రైమ్, టాస్క్ఫోర్స్ పోలీసులకు ఉంది. కానీ ఈ కేసులో కాలయాపన చేస్తుండటంతో, బ్రహ్మానాయుడు చట్టపరమైన లొసుగులను వాడుకుంటూ ముందస్తు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిందితుడికి ఈ రకమైన పారిపోయే మార్గాలను కల్పించడం వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే కోణంలో చర్చ సాగుతోంది.
దరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై బ్రహ్మానాయుడు కుమారుడు భిన్నంగా స్పందించారు. ఈ వ్యవహారమంతా కేవలం ఎల్లో మీడి ’ చేస్తున్న తప్పుడు ప్రచారమేనంటూ ఆయన తాజాగా ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. భూకబ్జా ఆరోపణలను కొట్టిపారేస్తూ, తమపై కావాలనే బురద జల్లుతున్నారని సదరు వీడియోలో పేర్కొనడం ద్వారా కేసు తీవ్రతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే విమర్శలు వస్తున్నాయి.
అధికార బలం, ధన బలంతో చట్టాలంటే ఏమాత్రం భయం లేని ఇలాంటి శక్తులకు తప్పించుకునే అవకాశం ఇస్తే, వారు సమాజంలో మరిన్ని అక్రమాలకు తెగబడే ప్రమాదం ఉంది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరబడుతున్న కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది.
