వవన్ వెనుక టాలీవుడ్ ఉంటుందా..? జగన్ వెనుకా ?

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజాకీయ నేతలకు ముఖ్యంగా పాలకుల కాళ్ల దగ్గరకు పోవాల్సిన పని లేదని పోరాడితే సరిపోతుందన్న ఉద్దేశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. కన్నేస్తే కాలిపోతారని ఏపీ పాలకులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆయన కొంతమందిని పాయింటవుట్ చేశారు. జగన్‌తో బంధుత్వం ఉన్నందున మోహన్ బాబు గురించీ ప్రస్తావించారు. ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ పవన్ వెనుక ఉంటుందా..? లేకపోతే భయపడి ఎప్పట్లాగే సైలెంట్‌గా ఉంటారా ? అన్నది ఇక్కడ ప్రధాన సందేహం.

టాలీవుడ్‌ను ఫ్యాక్షన్ స్టైల్లో వేధిస్తున్న ఏపీ ప్రభుత్వం !

ఆర్థిక మూలాలు దెబ్బకొడితే ప్రత్యర్థులు తమ కాళ్ల దగ్గరకు వస్తారనేది ఫ్యాక్షనిస్టుల ప్రధానమైన వ్యూహం అని చెబుతూంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు టాలీవుడ్ లో అందర్నీకాళ్ల దగ్గరకు తెచ్చుకోవడానికి వారి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో టాలీవుడ్ కూడా అగ్రభాగంలో ఉంటుంది. ఈ కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. పాత తరహాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రోత్సాహకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిచింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ ధియేటర్లపై ఆంక్షలు ఉన్నాయి. మూడు షోలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. సగం టిక్కెట్లు మాత్రమే అమ్మాలి. అదీ కాకుండా టిక్కెట్ రేట్లు పదేళ్ల కిందటి నాటివి ఖరారు చేశారు. ఇప్పుడు టిక్కెట్లు కూడా అమ్ముతామంటూ బయలుదేరారు. దీంతో ఇండస్ట్రీలో సంక్షోభం ప్రారంభం అయింది.

జగన్‌తో సన్నిహితంగానే ఉన్నారే.. ఇంకా ఏం కావాలి ?

ఇప్పటికే చిరంజీవి బృందం రెండు సార్లు జగన్‌తో సమావేశం అయింది. టాలీవుడ్ బిగ్గీస్‌గా చెప్పుకునేవారితో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాగార్జునతో జగన్ ఆయన అక్రమాస్తుల నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి జగన్ అపాయింట్ మెంట్ ఇస్తారు..సమస్యలు చెప్పుకోండని ఆఫర్ ఇచ్చారు. చిరంజీవి కూడా సమస్యలు చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. మొదట సెప్టెంబర్ నాలుగో తేదీ అన్నారు.. తర్వాత 20వ తేదీ అన్నారు. కానీ ఏ సమావేశమూ జరగలేదు. మధ్య లో ఓ సారి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి చిరంజీవితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏం జరిగిందో.. ఏం చర్చించారో ఎవరికీ తెలియదు కానీ ఆ తర్వాత సినీ ప్రముఖులతో చర్చించడానికి జగన్ ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది.

పవన్ కల్యాణ్ వెనుక టాలీవుడ్ మొత్తం ఉంటేనే ఫలితం .. లేకపోతే కష్టమే !

చిరంజీవి, నాగార్జున కోరిక మేరకే టిక్కెట్లను ప్రభుత్వం అమ్ముతోందని చెబుతోంది. కానీ వారెవరూ అలాంటి ప్రతిపాదన చేయలేదని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రకటనను ఖండించలేని నిస్సహాయ ఆ స్టార్లకు ఉంది. అలాంటి నిస్సహాయతను అడ్డం పెట్టుకునే ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌పై పెత్తనానికి సిద్ధమయిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై సమరం ప్రకటించారు. ఇలాంటి సమయంలోనూ ఇండస్ట్రీ మొత్తం ఏక తాటిపై లేకపోతే నష్టపోయేది చిత్రపరి‌శ్రమే. అందరూ ప్రభుత్వంపై విరుచుకుపడితేనే లక్ష్యం సాధిస్తారు. లేకపోతే పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close