చిరంజీవి చేతికి స‌ర్జరీ

ఆదివారం చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి హాజ‌ర‌య్యారు. అయితే ఆయ‌న చేతికి క‌ట్టు చూసి కాస్త కంగారు ప‌డ్డారు. చిరుకి ఏమైంది? ఆ చేతికి క‌ట్టెందుకు క‌ట్టారు? అనే విష‌య‌మై చ‌ర్చ మొద‌లైంది. అభిమానుల్లో కంగారు పెంచ‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతోనో ఏమో.. చిరు ఆ క‌ట్టు సంగ‌తి చెప్పేశారు. చిరు చేతికి స‌ర్జ‌రీ అయ్యింద‌ట‌. రెండ్రోజుల క్రింద‌ట‌ అపోలోలో చిన్న పాటి ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని, ప‌దిహేను రోజుల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని, అందుకే `గాడ్ ఫాద‌ర్‌` షూటింగ్ ని వాయిదా వేయాల్సివ‌చ్చింద‌ని చిరు పేర్కొన్నారు. కుడి చేత్తో ఏదైనా ప‌నిచేస్తున్న‌ప్పుడు చేతికి తిమ్మిరిగా అనిపించేద‌ని, ఈదే విష‌యం డాక్ట‌ర్ల‌కు చెబితే, చిన్న‌పాటి స‌ర్జ‌రీ అవ‌స‌రం అని చెప్పార‌ని, చేతికి ఉండే న‌రాల‌పై ఒత్తిడిపెర‌గ‌డం వ‌ల్ల‌…. స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంద‌ని, అపోలోలో 45 నిమిషాల పాటు ఆప‌రేష‌న్ జ‌రిగింద‌నిచిరు చెప్పుకొచ్చారు. చిరు చేతిలో `ఆచార్య‌`, `భోళా శంక‌ర్‌`, `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాల‌తో పాటుగా బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా ఉంది. `గాడ్ ఫాదర్‌` షూటింగ్ ఇటీవ‌ల సిమ్లాలో మొద‌లైంది. చిరు చేతికి స‌ర్జ‌రీ కార‌ణంగా ఇప్పుడు ఆ షూటింగ్ వాయిదా ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close