హుజురాబాద్‌లో “సమీప” గుర్తుల బాధ ఎవరికో !?

రాజకీయాల్లో “సమీప” ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సమీప ప్రత్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన వారే అయి ఉండాలని లేదు. ఒక్కో సారి పోలింగ్ అయిపోయిన తర్వాత ఎవరో తెలియని ఆ ప్రత్యర్థులు తమ పాలిట విలన్లుగా మారారని మాత్రమే గుర్తించగలరు. ఎందుకంటే.. వారు తమ గుర్తుల ద్వారానే ఆ హోదాను తెచ్చుకుంటాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులను పోలి ఉండే గుర్తులు ఉన్న ఇండిపెండెంట్లు కొన్ని చోట్ల ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తూంటారు. హుజురాబాద్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోది.

హుజూరాబాద్ బ‌రిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ఇత‌రులు 27 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. హోరాహోరీగా పోరు సాగుతోందని .. ఎవరు గెలిచినా మెజార్టీ తక్కువేనన్న అంచనాలు ఉన్నాయి. ప‌ఇలాంటి స‌మ‌యంలో ఇండిపెండెట్లు ఎక్కడ త‌మ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బతీస్తారోన‌ని బీజేపీ, టీఆర్ఎస్ భయపడుతున్నాయి. కారు, క‌మ‌లం గుర్తుల‌ను పోలిన చిహ్నాలు పొందిన వారు కూడా ఈ జాబితాలో ఉండ‌టమే దీనికి కారణం. ఈవీఎంలు ఉండే గదుల్లో తక్కువ లైటింగ్ ఉంటుంది. అందుకే కంగారులో ఏ గుర్తుపై ఓటేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇండిపెండెంట్ అభ్యర్థి. ఆ ఉప ఎన్నిక‌లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 1,400 మాత్రమే. ఉప ఎన్నికలలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధికంగా 3,500 ఓట్లు వ‌చ్చాయి. అత‌నితో పాటు అదే ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మ‌రికొంద‌రు స్వతంత్రుల‌కు 500 నుంచి 2 వేల ఓట్ల వ‌ర‌కు ప‌డ్డాయి.. వీరికి కారును పోలిన గుర్తులు రావడమే కారణం. అందుకే రాజకీయ పార్టీలు ప్రధానంగా గుర్తుపై అవగాహన పెంచేందుకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close