టీడీపీ నేతల ఇళ్లు,ఆఫీసులపై వైసీపీ విధ్వంసం !

ఆంధ్రప్రదేశ్‌లో రౌడీరాజ్యం అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ నేతలకు అధికార పార్టీ నేతలు చూపించారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ నేతలు, ఆఫీసుల్లో విధ్వంసం సృష్టించారు. ఒక్కరంటే ఒక్క పోలీసు ఎక్కడా అడ్డుకోలేదు. కనీసం సెక్యూరిటీ ఇవ్వలేదు. కొన్నాళ్ల క్రితం వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో హస్తం ఉందని ఫేక్‌న్యూస్ ను ఆధారం చేసుకుని రిలయన్స్ దుకాణాలపై వ్యవస్థీకృతంగా జరిగిన దాడుల్లాగే టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. అందరికీ ఒకే సారి దాడులు చేయాలని సమాచారం పంపారని.. అడ్డుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలిచ్చారని భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై యాభై మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన సామాగ్రినంతటిని ధ్వంసం చేశారు. పట్టపగలు అందరూ చూస్తూండగానే నింపాదిగా దాడులు చేసి వెళ్లిపోయారు. గతంలో ఓ రెండు సార్లు పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఒక్క పట్టాభిరామ్ ఇంటిపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులు జరిగాయి. కొంత మంది సెక్యూరిటీని నెట్టేసి కార్యాలయంలోకి దూసుకెళ్లి దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

కడప సహా పలు చోట్ల టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడా పోలీసులు అడ్డుకోవడం కానీ .. భద్రత కల్పించడం కానీ చేయలేదు. గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో వైసీపీ నేతలపై నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేయడంతో నర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అర్థరాత్రి ఇంటికి వెళ్లారు. ఈ అంశంపై ఉదయం మీడియాతో మాట్లాడిన పట్టాభిరామ్ వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు చేశారు. దానికి ప్రతిగా దాడులు చేసినట్లుగా భావిస్తున్నారు.

ఈ దాడులపై చంద్రబాబునాయుడు అమిత్ షా, గవర్నర్లకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీనే దాడులకు పాల్పడుతోందని తమ ప్రాణాలకు గ్యారంటీలేదని చెప్పారు. ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close